Vadacurry
-
స్వాతికో చిత్రం
టాలీవుడ్లో కలర్స్ స్వాతిగాను కోలీవుడ్లో సుబ్రమణిపురం స్వాతిగానూ గుర్తింపు పొందింది స్వాతి. హీరోయిన్గా ఈ రెండు భాషల్లోనూ పేరు తెచ్చుకున్న ఈమె ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ఈ మధ్య మాలీవుడ్లోను నటించేస్తున్నారు. ఈమె తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటించడం వలనే ఎక్కడా ప్రముఖ నటిగా ఎదగలేకపోతున్నారేమో. ఏదేమైనా ఆ మధ్య వడకర్రి చిత్రంలో నటించిన స్వాతికి తాజా మరో అవకాశం వచ్చింది. తిరి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది మానవ సంబంధాలను ఆవిష్కరించే కథా చిత్రమట. నవ దర్శకుడు అశోక్ అమృత్రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ గోల్డ్ ప్రొడక్షన్స్ పతాకంపై నికె బాలమురుగన్, ఆర్.బాలగోపి నిర్మిస్తున్నారు. యువ నటుడు అశ్విన్ కథా నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో జయప్రకాష్, కరుణాకరన్, అనూపమకుమార్, సెండ్రామణి తదితరు లు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ తిరి యథార్థ సంఘటనలతో కూడిన కమర్షియల్ కథా చిత్రం అన్నారు. ఒక బిడ్డ జీవితంలో తల్లిదండ్రులెంత ముఖ్యమైన వారు అని చెప్పే ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం తిరి అన్నారు. సహనాన్ని నిగ్రహిం చుకోవడం ఎంత ముఖ్యమో అవసరం అయినప్పుడు దాన్ని ఉపయోగించడం అంత అవసరం అని చెప్పే చిత్రం ఇదన్నారు. -
ఐఫోన్ కొట్టేసి.. ఇలా నవ్విస్తున్నాడు..!
-
సన్నీ లియోన్ ఆటతో కుల్ఫీ
ఓ కుర్రాడికి సెల్ఫోన్ కొనుక్కోవాలనే ఆశ. ఆ ఆశను నెరవేర్చుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న తమిళ చిత్రం ‘వడకర్రి’. జై, స్వాతి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శరవణరాజన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ‘కుల్ఫీ’ పేరుతో నరసింహారెడ్డి సామల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు, కస్తూరి ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో శృంగారతార సన్నీ లియోన్ ప్రత్యేక నృత్య గీతంలో నర్తించారు. ఈ సినిమా విశేషాలు తెలియజేయడానికి సోమవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘నా తొలి ప్రయత్నమిది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ‘వడకర్రి’ తెలుగు అనువాదంతో నా కెరీర్ మొదలవ్వడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు రొమాంటిక్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రపంచ ప్రఖ్యాత శృంగారతార సన్నీ లియోన్ ఈ చిత్రంలో ప్రత్యేక నృత్య గీతంలో నర్తించడం మరో విశేషం. యువన్ శంకర్రాజా ఆరు భిన్నమైన గీతాలను ఈ సినిమా కోసం స్వరపరిచారు. జూన్ 2న పాటల్ని, అదే నెలలో తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కథ, కథనంతో పాటు పాటల చిత్రీకరణ కూడా భిన్నంగా ఉంటుందని మాటల రచయిత కృష్ణతేజ అన్నారు. కుటుంబ ప్రేక్షకులకు నచ్చే మంచి సినిమా ఇదని నిర్మాణ నిర్వాహకుడు ఎ.ఎన్.బాలాజీ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వెంకటేశ్, సమర్పణ: శ్రీనివాసరెడ్డి సామల, నిర్మాణం: ఎస్.ఎన్.ఆర్ సినిమాస్. -
కోలీవుడ్లో చిందుకు సన్ని లియోన్ రెడీ
నటి సన్ని లియోన్ గురించి తెలియనివారుండరు. ఎందుకంటే, సంచలన బాలీవుడ్ చిత్రం జిస్మి-2లో ఈ బ్యూటీ అందాలు యువతను గిలిగింతలు పెట్టించాయి. ప్రస్తుతం హిందీలో క్రేజీ నటిగా వెలుగొందుతున్న ఈ భామ తాజాగా కోలీవుడ్ తెరపై చిందు వేయడానికి సిద్ధం అవుతోంది. యువ నటుడు జయ్ ఊహా సుందరిగా ఆయనతో కలిసి ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జయ్ నటిస్తున్న తాజా చిత్రం వడకరై. స్వాతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి మెగా ఎంటర్టైన్ మెంట్ పతాకంపై దయానిధి అళగిరి నిర్మిస్తున్నారు. వెంకట్ ప్రభు శిష్యుడు శరవణన్ నాగరాజన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో ఇండో, కెనడియన్ బ్యూటీ సన్ని లియోన్ సింగిల్ సాంగ్కు నర్తించనుంది. ఈ పాటను డిసెంబర్లో భారీ సెట్లో చిత్రీకరించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. కాగా ఈ జిస్మి-2 బేబీ యువ నటుడు భరత్ నటిస్తున్న హిందీ చిత్రం జాక్పాట్లో కూడా నటించిందనేది గమనార్హం.