
స్వాతికో చిత్రం
టాలీవుడ్‌లో కలర్స్ స్వాతిగాను కోలీవుడ్‌లో సుబ్రమణిపురం స్వాతిగానూ గుర్తింపు పొందింది స్వాతి. హీరోయిన్‌గా ఈ రెండు భాషల్లోనూ పేరు తెచ్చుకున్న ఈమె ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ఈ మధ్య మాలీవుడ్‌లోను నటించేస్తున్నారు. ఈమె తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటించడం వలనే ఎక్కడా ప్రముఖ నటిగా ఎదగలేకపోతున్నారేమో. ఏదేమైనా ఆ మధ్య వడకర్రి చిత్రంలో నటించిన స్వాతికి తాజా మరో అవకాశం వచ్చింది. తిరి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది మానవ సంబంధాలను ఆవిష్కరించే కథా చిత్రమట. నవ దర్శకుడు అశోక్ అమృత్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ గోల్డ్ ప్రొడక్షన్స్ పతాకంపై నికె బాలమురుగన్, ఆర్.బాలగోపి నిర్మిస్తున్నారు.
యువ నటుడు అశ్విన్ కథా నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో జయప్రకాష్, కరుణాకరన్, అనూపమకుమార్, సెండ్రామణి తదితరు లు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఎస్‌ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ తిరి యథార్థ సంఘటనలతో కూడిన కమర్షియల్ కథా చిత్రం అన్నారు. ఒక బిడ్డ జీవితంలో తల్లిదండ్రులెంత ముఖ్యమైన వారు అని చెప్పే ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం తిరి అన్నారు. సహనాన్ని నిగ్రహిం చుకోవడం ఎంత ముఖ్యమో అవసరం అయినప్పుడు దాన్ని ఉపయోగించడం అంత అవసరం అని చెప్పే చిత్రం ఇదన్నారు.