కోలీవుడ్‌లో చిందుకు సన్ని లియోన్ రెడీ | Sunny Leone's HOT Item Song In Tamil Movie Vadacurry | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌లో చిందుకు సన్ని లియోన్ రెడీ

Published Tue, Nov 26 2013 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM

కోలీవుడ్‌లో చిందుకు సన్ని లియోన్ రెడీ

కోలీవుడ్‌లో చిందుకు సన్ని లియోన్ రెడీ

నటి సన్ని లియోన్ గురించి తెలియనివారుండరు. ఎందుకంటే, సంచలన బాలీవుడ్ చిత్రం జిస్మి-2లో ఈ బ్యూటీ అందాలు యువతను గిలిగింతలు పెట్టించాయి. ప్రస్తుతం హిందీలో క్రేజీ నటిగా వెలుగొందుతున్న ఈ భామ తాజాగా కోలీవుడ్ తెరపై చిందు వేయడానికి సిద్ధం అవుతోంది. యువ నటుడు జయ్ ఊహా సుందరిగా ఆయనతో కలిసి ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జయ్ నటిస్తున్న తాజా చిత్రం వడకరై.
 
  స్వాతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మెగా ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై దయానిధి అళగిరి నిర్మిస్తున్నారు. వెంకట్ ప్రభు శిష్యుడు శరవణన్ నాగరాజన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో ఇండో, కెనడియన్ బ్యూటీ సన్ని లియోన్ సింగిల్ సాంగ్‌కు నర్తించనుంది. ఈ పాటను డిసెంబర్‌లో భారీ సెట్‌లో చిత్రీకరించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. కాగా ఈ జిస్మి-2 బేబీ యువ నటుడు భరత్ నటిస్తున్న హిందీ చిత్రం జాక్‌పాట్‌లో కూడా నటించిందనేది గమనార్హం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement