రకరకాల ఐస్‌క్రీం ప్లేవర్స్ ఉన్నా కూడా కుల్ఫీ చూడగానే దాన్ని తినేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు. అది అంతలా మధురంగా యమ్మీ..యమ్మీగా ఉంటుంది. దీనికి తీసుపోనిదీ ఏదీ లేదన్నట్లుగా.. ఇష్టంగా తినే చల్లటి పదార్థాలలో దీనిదే అగ్రస్థానం. అంతలా తనదైన రుచితో ప్రజల మనసును దోచుకుంది. అలాంటి కుల్ఫీ ఎలా తయారవుతుందో, ఏవిధంగా ప్యాక్ చేస్తారో చూద్దాం
మంచి ఎండల్లోనూ లేదా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చల్లటి కుల్ఫీ తింటే.. ఆ ఫీల్ వేరు. అబ్బా తలుచుకుంటేనే నోట్లోకి నీళ్లూరతాయి. పిల్లలు దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ దీని రుచికి ఫిదా అవుతారు. అలాంటి కుల్ఫీ ఎలా తయరవుతుందో తెలుసుకుందామనే ఆసక్తి అందరికీ ఉంటుంది కదా. ఐతే ఘజియాబాద్‌లోని ఓ ఫ్యాక్టరీ ఆ కుల్ఫీ ఎలా తయారువుతుందో విపులంగా వెల్లడించింది.
సుమారు 120 లీటర్ల పాలనను మిషన్‌లో వేసి బాగా మరిగించి అందులో పాలపొడి, పంచదార తదితరాలను వేసి చిక్కగా మార్చుతుంది. ఆ తర్వాత 14 డిగ్రీల సెల్సియస్ చేరుకునేలా చల్లబరుస్తుంది. ఆ తర్వాత చక్కగా ప్యాక్ చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
(చదవండి: స్వాతంత్య్ర పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఐకానిక్ స్వీట్ ఏంటో తెలుసా! ఎలా చేయాలంటే)
Comments
Please login to add a commentAdd a comment