జస్ట్‌ మిస్‌....లేదంటే పాపం ఆ చిన్నారి.... 11 Year Old Girl Narrow Escape Pack Of Dogs Attack In Ghaziabad | Sakshi
Sakshi News home page

Viral Video: జస్ట్‌ మిస్‌....చిన్నారిపై మూకుమ్మడిగా కుక్కలు ఎటాక్‌!

Published Sun, Nov 20 2022 1:14 PM

11 Year Old Girl  Narrow Escape Pack Of Dogs Attack In Ghaziabad - Sakshi

ఘజీయిబాద్‌: ఇటీవలకాలంలో చిన్నారులపై తరుచుగా వీధికుక్కల దాడులు గురించి వింటున్నాం. మొన్నటికి మొన్న ఒక మూడేళ్ల బాలుడు కుక్కల దాడిలో మృతి చెందాడు. అంతకుముందు ఒక పదేళ్ల చిన్నారి కుక్కల దాడిలో దారుణంగా గాయపడింది. ఈ ఘటనలు మరువక మునుపే అచ్చం అలాంటి ఘటనే ఘాజియా బాద్‌లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే....ఘజియాబాద్‌లోని 11 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసేందుకు యత్నించాయి. ఆ చిన్నారి తన అపార్టమెంట్‌ కమ్యూనిటీ నుంచి బయటకు వెళ్లగా ఒక్కసారిగా ఎక్కడ నుంచి వచ్చాయో ఏమో! ఒక కుక్కల గుంపు ఆ చిన్నారి వెంట పడ్డాయి. దీంతో ఆ చిన్నారి ఒక్క ఊదుటన వేగంగా పరుగుతీసి తన అపార్టమెంట్స్‌ కమ్యూనిటీ గేట్‌లోకి వెళ్లిపోవటంతో ఆ కుక్కల బారి నుంచి తప్పించుకోగలిగింది. ఆమె ఇలా గేట్‌లోకి రాగానే వెంటనే అక్కడ ఉన్నసెక్యూరిటీ సిబ్బంది బయటకు వచ్చారు. దీంతో ఆ క్కుక్కల తోక ముడిచి వెనుదిరిగాయి. జస్ట్‌ మిస్‌ లేదంటే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ కుక్కల దాడి కి బలయ్యి ఉండేది. 

(చదవండి: 'నా పేరు సరిచేయండి' మహా ప్రభో! కుక్కలా మొరుగుతూ నిరసన)
 

Advertisement
 
Advertisement
 
Advertisement