ఈ ‘కుల్ఫీ’ అందరికీ నచ్చుతుంది | Kulfi Movie Audio Launched | Sakshi
Sakshi News home page

ఈ ‘కుల్ఫీ’ అందరికీ నచ్చుతుంది

Published Tue, Jun 10 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

ఈ ‘కుల్ఫీ’ అందరికీ నచ్చుతుంది

ఈ ‘కుల్ఫీ’ అందరికీ నచ్చుతుంది

‘‘చక్కటి రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. ‘కుల్ఫీ’ అనే మంచి టైటిల్ కుదిరింది. కచ్చితంగా ఈ ‘కుల్ఫీ’ అందరికీ నచ్చుతుంది’’ అని నటి ‘కలర్స్’ స్వాతి చెప్పారు. జై, ‘కలర్స్’ స్వాతి నటించిన తమిళ చిత్రం ‘వడకర్రి’ని తెలుగులో సామల నరసింహారెడ్డి అనువదించారు. శరవణ రాజన్ దర్శకుడు. ఈ చిత్రం పాటల సీడీని దర్శకుడు సాగర్, బిగ్ సీడీని దర్శకుడు సముద్ర, నిర్మాత సురేష్ కొండేటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సామల నరసింహారెడ్డి మాట్లాడుతూ -‘‘మాకిది తొలి సినిమా.
 
  భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీస్తాం. పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఓ పాటలో నర్తించడం విశేషం’’ అని చెప్పారు. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర సమర్పకుడు సామల శ్రీనివాసరెడ్డి తెలిపారు. యువన్ శంకర్‌రాజా ఓ పాటకు సంగీతం అందించారని నిర్మాణ నిర్వాహకుడు బాలాజీ చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు వివేక్, మర్విన్ సాల్మన్, దర్శకుడు శరవణ రాజన్, రచయిత కృష్ణతేజ, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement