రెండవ రోజు వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు | Udupi Gears Up For Grand Celebrations On Krishna Janmashtami On Second Day, More Details Inside | Sakshi
Sakshi News home page

రెండవ రోజు వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

Published Tue, Aug 27 2024 10:04 AM | Last Updated on Tue, Aug 27 2024 12:16 PM

Udupi Gears up to Celebrate Krishna Janmashtami

కర్నాటకలోని ఉడుపిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమైన వేడుకలు ఈరోజు (మంగళవారం) కూడా కొనసాగుతున్నాయి. యూపీలోని మధురలో నిన్న(సోమవారం) రాత్రి అత్యంత వేడుకగా శ్రీకృష్ణునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. 
 

ఉడిపి శ్రీకృష్ణుని ఆలయంలో నేడు  శ్రీకృష్ణ లీలోత్సవం  అత్యంత వేడుకగా జరగనుంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు శ్రీ కృష్ణ  భక్తులు ఇప్పటికే ఉడుపికి తరలివచ్చారు. ఉత్సవాల్లో తొలి రోజున పలువురు చిన్నారులు బాలకృష్ణుని వేషధారణలో ఆలయంలో కనువిందు చేశారు. అలాగే రోజంతా స్వామివారి సమక్షంలో వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.

నేడు జరిగే శ్రీకృష్ణుని లీలోత్సవంలో బంగారు రథంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఊరేగిస్తారు. ఈ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానుంది. అలాగే మఠంలో భక్తులకు సంప్రదాయాలకు చిహ్నంగా నిలిచే వివిధ పోటీలను నిర్వహించనున్నారు.

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడి గోవిందరాజ ఆలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య జన్మాష్టమి వేడులను నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement