
సాక్షి, హైదరాబాద్: ఆ్రస్టేలియా దేశంలో నివసిస్తున్న తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మెల్‌బోర్న్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సంక్రాంతి సంబురాలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎ.పి.జితేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎస్.శివసేనారెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ ఎల్లలు దాటి వచ్చినా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రవాసులు కాపాడుతున్నారని ప్రశంసించారు. తెలంగాణలో ఉన్నది ప్రజా ప్రభుత్వమని, తెలుగు పారిశ్రామికవేత్తలు తమ తమ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారమందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment