
వెర్రి వెయ్యి రకాలు, పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి వంటి సామెతలు తామరతంపరగా గుర్తుకొస్తాయి ఈ మహిళను చూస్తే. ఇదేం పిచ్చి ఈమెకు అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. అరే అందంగానే ఉంది కదా..మళ్లీ ఇదేం ఆలోచన అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు ఆమె చేసిన ఘనకార్యం చూసి. డబ్బులు ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయేమో కాబోలు అంటున్నారు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే..
పిల్లిలా కనిపించాలనే అనే పబ్లిసిటీ స్టంట్‌కి శ్రీకారం చుట్టింది ఆస్ట్రేలియాలోని గోల్‌కోస్ట్‌కు చెందిన జోలీన్ డాసన్(29). సాధ్యాసాధ్యాలు గురించి ఆలోచించకుండా కాస్మెటిక్ సర్జరీకి రెడీ అయిపోయింది. ఆ సర్జరీ ఆమెకు చుక్కలు చూపించింది. ఆ ప్రచార స్టంట్ తెచ్చిన తంట అంత ఇంత కాదు..!. ఏకంగా ఆరు లక్షలు పైనే ఖర్చు చేసి మరీ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది డాసిన్.
ఏదైనా తేడా కొడుతుందేమోనని అనుమానపడింది. ఆ అనుమానమే నిజమై పడరాని కష్టాలు తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఆ సర్జరీ వికటించి దుష్ప్రభావాలు చూపించడం ప్రారంభించింది. పిల్లిలా కనిపించేందుకు చెంపలను తొలగించే సర్జరీ ఆమెకు తీవ్రమైన నొప్పిని, బాధని కలిగించింది. అంతలా బాధ భరించిన సర్జరీ సక్సెస్ అవ్వకపోగా..శరీరం దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది.
అలానే ఆమె ఆకృతి పిల్లిలా మారలేదు కదా..కింది ముఖం రూపురేఖలు దారుణంగా మారిపోయాయి. అయ్యిందేదో అయ్యిందేలా అని ఆ రూపాన్నే కొనసాగిద్దామని చికిత్సలు తీసుకున్నా..యాసిడ్ రిఫ్లక్స్ వంటి ఊహించని దుష్ప్రభావాలకు తలెత్తాయి. దీంతో ఆమె పిల్లి ఆకృతి కోసం అమర్చిన ఫిల్లర్లు, ఇంప్లాంట్‌లను తొలగించుకుంది.
కనీసం ఇప్పుడైనా.. తన పరిస్థితి మెరుగ్గా ఉంటుందేమోనని ఆశిస్తున్నా..అని బాధగా చెప్పుకొచ్చింది. తన చేయాలనుకున్న స్టంట్ ఎంత మతిలేని పని అని ఇప్పుడిప్పుడే తెలుస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంతేగాదు తనలా ఎవరూ ఇలాంటి చెత్త ప్రయోగాల జోలికి అస్సలు వెళ్లొద్దని సూచిస్తోంది కూడా. పెద్దలు చెబుతుంటారే..సవరం అయ్యాక గానీ వివరం రాదంటే ఇదేనేమో..!. లోతు పాతులు..కష్టనష్టాలు బేరీజు వేసుకుని ఏ స్టంట్‌కైనా లేదా ఏ పనికైనా.. పూనుకోవాలి లేదంటే అంతే సంగతులు..
(చదవండి: ఆభరణాల క్రియేటివిటీ వెనుక ఇంట్రస్టింట్ స్టోరీ ఇదే..!)