దీపావళి వేడుకలను భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గురువారం(అక్టోబర్ 31) ఘనంగా చేసుకోనున్నారు. దీపావళి కోసం షాపింగ్ చేయడంతో సహా అన్ని సన్నాహాలు చాలా ముందుగానే ప్రారంభిస్తారు.
దీపావళినాడు లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజిస్తారు. అయితే మన దేశంలో దీపావళి జరుపుకోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆ ప్రదేశాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి పండుగను దక్షిణ రాష్ట్రమైన కేరళలో జరుపుకోరు. కేరళలో కొచ్చిలో మాత్రమే దీపావళి జరుపుకుంటారు. కేరళలో దీపావళి జరుపుకోకపోవడానికి అనేక కారణాలున్నాయి.
మహాబలి అనే రాక్షసుడు కేరళను పరిపాలించేవాడు. అతన్ని ఇక్కడి ప్రజలు పూజిస్తారు. దీపావళి ఒక రాక్షసుని ఓటమిని గుర్తు చేస్తూ చేసుకునే పండుగ కావడంతో దీనిని ఇక్కడి ప్రజలు జరుపుకోరు. రాముడు రావణుడిని ఓడించి, అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి చేసుకుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. కేరళలో దీపావళి జరుపుకోకపోవడానికి రెండవ కారణం అక్కడ హిందువుల సంఖ్య తక్కువగా ఉండటం. అందుకే రాష్ట్రంలో దీపావళి సందడి కనిపించదు. కేరళతో పాటు తమిళనాడులో కూడా దీపావళి జరుపుకోరు. అక్కడ ప్రజలు నరక చతుర్దర్శిని వేడుకగా జరుపుకుంటారు.
ఇది కూడా చదవండి: ‘మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం’
Comments
Please login to add a commentAdd a comment