మాలీవుడ్‌కు హన్సిక | Hansika entry into maliwood | Sakshi
Sakshi News home page

మాలీవుడ్‌కు హన్సిక

Feb 3 2017 1:52 AM | Updated on Sep 5 2017 2:44 AM

మాలీవుడ్‌కు హన్సిక

మాలీవుడ్‌కు హన్సిక

ముద్దుగుమ్మ హన్సిక మాలీవుడ్‌ ఎంట్రీ షూరూ అయ్యింది.

ముద్దుగుమ్మ హన్సిక మాలీవుడ్‌ ఎంట్రీ షూరూ అయ్యింది. ఇప్పటి వరకూ తమిళం, తెలుగు భాషల్లోనే నటించిన ఈ ఉత్తరాది భామకు ఈ రెండు భాషల్లోనూ ఇప్పుడు అవకాశాలు అడుగంటాయి. కోలీవుడ్‌లో నటించిన ఒకే ఒక్క చిత్రం భోగన్  గురువారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో అమ్మడి నటనను చిత్ర నిర్మాత ప్రభుదేవా, కథానాయకుడు జయంరవి తెగ మెచ్చుకుంటున్నారు. అయితే ఈ చిత్రంతో హన్సికకు ఇక్కడ అవకాశాలు వస్తాయో, రావో గానీ, మలయాళంలో ఒక అవకాశాన్ని దక్కించుకున్నారు. అక్కడ సూపర్‌స్టార్‌ మోహన్ లాల్‌ హీరోగా నటిస్తున్న భారీ చిత్రంలో ఒక కీలక పాత్రతో హన్సిక మాలీవుడ్‌కు పరిచయం కానున్నారన్నది తాజా సమాచారం. సుమారు రూ.30 కోట్ల వ్యయంతో తెరకెక్కనున్న ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ ముఖ్యపాత్ర పోషించనున్నారు.

అది ప్రతినాయకుడి పాత్ర అనే ప్రచారం జరుగుతోంది. ఈయనకు ఇదే తొలి మలయాళం చిత్రం అవుతుంది. మరో పాత్రలో శ్రీకాంత్‌ నటించనున్న ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్  దర్శకత్వంలో రాక్‌లైన్  వెంకటేశ్‌ నిర్మించనున్నారు. ఈయన ఇంతకు ముందు రజనీకాంత్‌ హీరోగా లింగా చిత్రాన్ని నిర్మించారన్నది గమనార్హం. నటుడు మోహన్ లాల్‌ ప్రస్తుతం 1971 బియాండ్‌ బోర్డర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత ఉన్నికృష్ణన్  దర్శకత్వంలో రూపొందనున్న ఈ భారీ చిత్రంలో నటిస్తారని సమాచారం. మొత్తం మీద నటి హన్సిక మాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేయనున్నారన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement