
ఇక రోమియోలకు చెక్
పోలీసుల ఆధ్వర్యంలో ఫిర్యాదు బాక్సుల ఏర్పాటు
శివమొగ్గ ఎస్పీ నూతన ప్రయోగం
శివమొగ్గ:అమాయిలు, మహిళలు, బాలికల వెంటపడి వేధించే రోమియోలకు చెక్ పెట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. ఇందు కోసం నగరంలో ఫిర్యాదుల బాక్స్‌లను ఏర్పాటు చేసింది. బాధితులు సమస్యను వివరిస్తూ బాక్స్‌లో వేస్తే వెంటనే కార్యాచరణ మొదలు పెట్టి రోమియోల ఆటకట్టిస్తామంటూ పోలీస్ శాఖ భరోసానిస్తోంది. ఈ మేరకు వివరాలను ఆదివారం మీడియా సమావేశంలో శివమొగ్గ జిల్లా ఎస్పీ రవి.డి.చెణ్ణన్నవర్ వెల్లడించారు. ఫిర్యాదు దారులు ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు.
నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్, మెయిన్ బస్టాండ్, సహ్యాద్రి కాలేజీ, మహాత్మాగాంధీ పార్క్, సవళంగరోడ్డు, ఉషా నర్సింగ్ హోం సర్కిల్, దేవరాజు అరసు రోడ్డు, కస్తూరిబా హాస్టల్ రోడ్డు, కువెంపు రంగ మందిరం, ఏటీఎన్‌సీసీ కాలేజీ, ృష్ణ కెఫే బస్టాఫ్, అణ్ణానగర్, గోపాల బస్టాండు, వినోభ నగర పోలీసు చౌకీ, సోమినకొప్ప లే ఔట్,ృఫథ్వీ బిల్డింగ్, సాగర్ రోడ్డులోని పెసట్ కాలేజీ, గోపాల మహిళా పాలిటెక్నిక్ కాలేజీ, బీహెచ్ రోడ్డులోని మీనాక్షి భవన్, కస్తూరిబా కాలేజీ ఎదురుగా, రాగి గుడ్డ సర్కిల్, మిళఘట్ట బస్టాఫ్, గాంధీ బజార్, మండ్లి సర్కిల్ ప్రాంతాల్లో ఫిర్యాదుల బాక్స్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే భద్రావతిలోని బసవేశ్వర సర్కిల్, సీగేబాగి బస్టాండు, ఎన్‌ఎంసీ రోడ్డు, తమిళ కాలేజీ ఎదురుగా, మామినకెరె గ్రామ బస్టాండు, హొసనగరలోని బస్టాండు, బట్టిమల్లప్ప సర్కిల్, పోలీస్ స్టేషన్, నిట్టూరు బస్టాఫ్, రిప్పన్‌పేట, వినాయక సర్కిల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ. తీర్థహళ్లిలోని ఆగుంబే పోలీస్ స్టేషన్, మేగరహళ్లి గర్ల్స్ కాలేజీ, ఆగుంబె బస్టాండ్ ప్రాంతాల్లో బాక్స్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.