కోలీవుడ్‌లో విజయ్ ఆంటోని సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్‌లో ‘లవ్ గురు’ అనే చిత్రంలో నటించారు. మృణాళిని రవి ఇందులో హీరోయిన్‌గా నటించింది. విజయ్ ఆంటోని స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. ఏప్రిల్ 11న తెలుగులో కూడా విడుదలైన లవ్ గురు ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని తెలుగులో విడుదల చేసింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్‌లో కూడా విజయ్ అంటోని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ లవ్ గురు సినిమా మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది. సినిమా విడుదలైన నెలలోపే తమిళ్ వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే తాజాగా తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్ ప్రేక్షకులను మెప్పించిన లవ్ గురు చిత్రాన్ని ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.
లవ్ గురు కథేంటి..?
అరవింద్ పాత్రలో విజయ్ ఆంటోని మెప్పించాడు. 35ఏళ్ల వయసొచ్చినా ప్రేమ, పెళ్లికి నోచుకోలేకపోయానే అనే బాధ అతనిలో ఉంటుంది. సింగిల్ జీవితానికి ముగింపు చెప్పాలన్న లక్ష్యంతో ఉన్న అరవింద్ ఓ చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల (మృణాళిని రవి)ని చూసి మనసు పారేసుకుంటాడు. దీనిని గ్రహించిన కుటుంబ సభ్యులు వారిద్దరికీ పెళ్లి చేస్తారు. కానీ, పెళ్లైన మరుసటి రోజే లీలాకు తనతో పెళ్లి ఇష్టం లేదన్న సంగతి అరవింద్‌కు అర్థమవుతుంది. ఈ పెళ్లి ఆమెకు ఎందుకు ఇష్టం లేదు..? లీలా కోరిక ఏంటి..? ఆమె మనసును గెలుచుకునేందుకు అరవింద్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు వంటి సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment