Actor Vijay Antony First Look From Love Guru Movie - Sakshi
Sakshi News home page

Vijay Antony: రొమాంటిక్ మూవీలో విజయ్ ఆంటోని

Published Fri, Aug 18 2023 6:57 AM | Last Updated on Fri, Aug 18 2023 8:20 AM

Actor Vijay Antony Love Guru Movie First Look - Sakshi

సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్‌ఆంటోని.. ఆ తర్వాత నటుడు, ఎడిటర్‌, నిర్మాతగా సక్సెస్ అయ్యారు. ఈ మధ్యే 'బిచ్చగాడు 2'తో దర్శకుడుగాను మారి హిట్ కొట్టారు. తాజాగా 'రోమియో' చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇది పాన్‌ ఇండియా చిత్రంగా తీస్తున్నారు. తెలుగులో లవ్‌గురు అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. 

(ఇదీ చదవండి: మెగాస్టార్ కొత్త సినిమా.. హారర్ థ్రిల్లర్ కథతో!)

ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ కాగా, వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్‌ ఆంటోని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆయన గుడ్‌ డెవిల్‌ అనే నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించడం విశేషం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇది రొమాంటిక్‌ లవ్‌ కథాచిత్రంగా తీస్తున్నట్లు విజయ్‌ చెప్పుకొచ్చారు. 

ఇందులో కొత్త విజయ్‌ ఆంటోనీని చూస్తారని ఆయన చెప్పారు. దీనికి భరత్‌ ధనశేఖర్‌ సంగీతాన్ని, ఫరూఖ్‌ జే.బాషా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా రోమియో చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు పరిశ్రమ వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

(ఇదీ చదవండి: ఆ రూమర్స్‌పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement