గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా! | Pooja Hegde joins Varun Tej is Valmiki | Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!

Published Sat, Jul 27 2019 12:27 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

Pooja Hegde joins Varun Tej is Valmiki - Sakshi

సెటిల్‌మెంట్స్‌ చేయాల్సిన గ్యాంగ్‌స్టర్‌ సెట్‌లో స్టెప్పులేశాడు. ఇదంతా ‘వాల్మీకి’ సెట్‌లో జరిగిందని తెలిసింది. వరుణ్‌ తేజ్, అధర్వ ముఖ్యతారాగణంగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజాహెగ్డే, మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో నటిస్తున్నారు వరుణ్‌. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ మాస్‌ సాంగ్‌ను చిత్రీకరించారని తెలిసింది.

ఈ పాటకు వరుణ్‌ వేసిన స్టెప్స్‌ అదుర్స్‌ అని సమాచారం. అలాగే ఈ సినిమా చిత్రీకరణలో తొలిసారి పాల్గొన్నారు పూజా హెగ్డే. గురువారం పూజ వాల్మీకి సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... తమిళ చిత్రం ‘జిగర్తండా’కు ఇది రీమేక్‌. ఓ గ్యాంగ్‌స్టర్‌ జీవితం ఆధారంగా సినిమా తీయాలని రియల్‌ గ్యాంగ్‌స్టర్‌ జీవితంతో ట్రావెల్‌ అయ్యే ఓ ఫిల్మ్‌ మేకర్‌ కథ ఆధారంగా ‘జిగర్తండా’  తెరకెక్కింది.
∙అధర్వ, వరుణ్‌ తేజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement