adharvaa
-
రూబిక్ క్యూబ్‌తో ప్రపంచ రికార్డు!
పెద్దవాళ్లు సైతం కష్టపడి పరిష్కరించే రూబిక్ క్యూబ్‌ను నేటితరం పిల్లలు ఇట్టే పరిష్కరిస్తూ ఔరా అనిపిస్తున్నారు. చిచ్చర పిడుగులాంటి ఎనిమిదేళ్ల అధర్వ ఒకేసారి మూడు రూబిక్ క్యూబ్‌లను పరిష్కరించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. బెంగళూరుకు చెదిన అధర్వ ఆర్భట్ ఒకేసారి చేతులు, కాళ్లు ఉపయోగించి మూడు రూబిక్క్యూబ్లను పరిష్కరించి గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. అంతేగాకుండా ‘వరల్డ్ బెస్ట్ మల్టీ టాస్కర్’ను కనుగొన్నామని గిన్నీస్ యాజమాన్యం నుంచి ప్రశంస అందుకున్నాడు. అధర్వ 2020 డిసెంబర్ 9న ఈ రికార్డు సృష్టించినప్పటికీ... తాజాగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ (జీడబ్ల్యూర్) అధికారిక యూట్యూబ్ చానెల్లో అధర్వ వీడియో పోస్టు చేయడంతో అతని రికార్డు వెలుగులోకి వచ్చింది. గిన్నిస్ యాజమాన్యం పోస్టు చేసిన వీడియోలో... అధర్వ ఒక్కో చేతిలో ఒక్కో రూబిక్ క్యూబ్నూ, రెండు కాళ్లతో ఒక రూబిక్ క్యూబ్‌ను ఒకేసారి పరిష్కరిస్తుంటాడు. అతని పక్కనే ఒక వ్యక్తి అధర్వ ఎంత సమయం లో పజిల్‌ను క్లియర్ చేస్తున్నాడో తెలిపే టైమర్ ను పట్టుకుని కూర్చుని ఉంటాడు. చాలా వేగంగా క్యూబిక్ పజిల్‌ను అటూ ఇటూ కదుపుతూ ఒక నిమిషం ఇరవైతొమ్మిది సెకన్లలోనే పూర్తిచేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా క్యూబ్ పజిల్ పరిష్కరించి రికార్డులు తిరగరాసిన అధర్వకు మన దేశానికి చెందిన కృష్ణంరాజు, చైనాకు చెందిన జియాన్యూ క్యూలు ప్రేరణ. వీరు గతంలో అత్యంత వేగంగా క్యూబిక్ పజిల్‌ను పూర్తిచేసి గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. వీరికంటే వేగంగా పజిల్‌ను పూర్తిచేసి రికార్డు కొట్టాలనుకున్న అధర్వ ఆ దిశగా సాధన చేసి చివరికి తను అనుకున్నది సాధించాడు. 2017 నుంచి రికార్డు కోసం సాధన చేస్తున్న అధర్వ 2018లో రాష్ట్ర స్థాయి ‘ బెస్ట్ ట్యాలెంట్ ఆఫ్ కర్ణాటక’ లో పాల్గొని కాళ్లతో క్యూబ్స్‌ను పరిష్కరిస్తూ ఫైనల్స్ వరకు చేరుకుని వీక్షకులను ఆశ్చర్యపరుస్తూ విజయం సాధించాడు. అయితే ఈ పోటీ టాలెంట్‌ను ప్రదర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మరింత కష్టపడి ప్రయత్నిస్తే గిన్నిస్ వరల్డ్ రికార్డు టైటిల్ గెలుచుకోవచ్చని అధర్వ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కరోనా కాలంలో ఆన్లైన్ తరగతులు వింటూ..తన గిన్నిస్ రికార్డు కోసం సాధనం చేసేవాడు. ఈ క్రమంలోనే పలుమార్లు క్యూబ్‌లు పరిష్కరిస్తూ సర్టిఫికెట్లు కూడా అందుకున్నాడు. ‘‘పజిల్స్ అంటే ఎంతో ఇష్టం, వాటిని పరిష్కరించడం మరెంతో ఇష్టమని చెబుతూ.. కుటుంబ ప్రోత్సాహంతోనే తానీ స్థాయికి చేరుకున్నానని అధర్వ చెప్పాడు. -
గద్దలకొండ గణేశ్... రచ్చ రచ్చే
‘‘మా కోబ్రా (కో–బ్రదర్. ‘ఎఫ్ 2’ లో వరుణ్ పాత్రను ఉద్దేశించి) లుక్ మొత్తం మార్చేశాడు.. ‘ఎఫ్ 2’ నుంచి ‘వాల్మీకి’ చిత్రానికి గెటప్ మార్చేశాడు. ఈ ట్రైలర్ చూడగానే టెరిఫిక్‌గా అనిపించింది. ‘గద్దలకొండ గణేశ్... రచ్చ రచ్చే’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. వరుణ్‌తేజ్, పూజాహెగ్డే, అధర్వ, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్మీకి’. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈనెల 20న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘ఆ వాల్మీకి దొంగ.. మంచిగా మారి రామాయణం రాశారు. మరి.. ఈ వాల్మీకి ఏం రాశాడో థియేటర్స్‌కు వెళ్లి చూడాలి. నాకు నమ్మకం ఉంది.. మా వరుణ్ రెచ్చిపోయి ఒక సూపర్ బ్లాక్‌బస్టర్ ఇస్తాడు. నా స్నేహితుడు పవన్ కల్యాణ్‌కు హరీశ్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ అనే బ్లాక్‌బస్టర్ సినిమా ఇచ్చాడు. మా వరుణ్‌కి కూడా సూపర్ హిట్ ఇస్తాడని నమ్మకంగా ఉన్నాను. నిర్మాతలు రామ్, గోపి కలిసి నాతో ‘నమో.. వెంకటేశ’ చేశారు. చాలా ప్యాషన్‌తో సినిమా చేస్తారు.. కానీ, సింపుల్‌గా ఉంటారు. ‘వాల్మీకి’ పెద్ద హిట్ అవ్వాలి, మంచి కలెక్షన్స్ రావాలి’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఈ గద్దలకొండ గణేశ్‌ని ఆశీర్వదించడానికి వచ్చిన మా సింగిల్ హ్యాండ్ గణేశ్ వెంకటేశ్ సర్కి థ్యాంక్స్. నేను ఫోన్ చేసి రావాలనగానే వెంటనే ఓకే అన్నారు.. అంత మంచి మనసు ఆయనది. ‘వాల్మీకి’ నా 9వ సినిమా. ఇప్పటి వరకూ ప్రయోగాలు, క్లాస్, లవ్‌స్టోరీలంటూ సినిమాలు చేశాను. ఫస్ట్ టైమ్ ఓ మాస్ సినిమా చేస్తే ఆ కిక్కే వేరప్పా.. మామూలుగా లేదమ్మా. చిరంజీవిగారు ఎప్పుడూ చెబుతుండేవారు.. ‘అరేయ్ మేము మాస్ సినిమాలు ఎందుకు చేస్తామో నీకు అర్థం కావట్లేదు అని’.. ఇప్పుడు ఫైనల్‌గా ఆ రుచిని కొంచెం చూశా.. థ్యాంక్యూ డాడీ. మా దాహం తీరే సినిమా ఎవరిస్తారు అనుకున్నాం.. హరీష్‌గారి ‘గబ్బర్‌సింగ్’ చూసినప్పుడు ఇదీ సినిమా అనిపించింది. మా బాబాయికి అంతపెద్ద సినిమా ఇచ్చిన ఆయన నాతో చేయడం నా అదృష్టం. రామ్, గోపీగార్లతో నా ప్రయాణం ఇకముందు కూడా సాగుతుందని కోరుకుంటున్నా. ‘ముకుంద’ సినిమా తర్వాత పూజాహెగ్డేతో చేద్దామనుకున్నా. ఆ సినిమా చేస్తున్నప్పుడు ‘అరే ఇంత అందమైన అమ్మాయిని పెట్టి మా మధ్య మాటలు ఇవ్వలేదు ఏంట్రా?’ అనిపించింది.. కానీ ‘వాల్మీకి’లో హరీష్‌గారు మా ఇద్దరి మధ్య మంచి సీక్వెన్స్ ఇచ్చారు. శోభన్‌బాబుగారి ‘వెల్లువొచ్చే గోదారమ్మ..’ రీమిక్స్ పాట చాలా బాగా వచ్చింది. మీ అందర్నీ(అభిమానులు) చూస్తే మా కుటుంబం ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది.. థ్యాంక్యూ. నిన్ననే చిరంజీవిగారిని, చరణ్ అన్నని కలిశా. ‘సైరా’ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. కానీ, వాళ్ల ఆశీర్వాదాలు, ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉంటాయి. ‘వాల్మీకి’ ట్రైలర్ చూసి బాబాయ్(పవన్ కల్యాణ్) నాతో, హరీష్గారితో మాట్లాడారు.. చాలా బాగుంది.. తెలంగాణ యాసలో చాలా బాగా మాట్లాడావు అన్నారు. మా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ(అభిమానులు) మళ్లీ మళ్లీ థ్యాంక్స్. కచ్చితంగా మీ అందరికీ ‘వాల్మీకి’ నచ్చుతుంది. అక్టోబర్ 2న మన ‘సైరా నరసింహారెడ్డి’ కూడా వస్తోంది. ‘వాల్మీకి’ని ఎంత హిట్ చేస్తారో అంతకు రెండు రెట్లు ‘సైరా’ ని కచ్చితంగా హిట్ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు. నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘వాల్మీకి’ టైటిల్ పెట్టడానికి కొంచెం గుండె ధైర్యం కావాలి.. సాహిత్యంపై పట్టుండి, ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి హరీష్‌లాంటి ఒక అద్భుతమైన డైరెక్టర్ ఈ టైటిల్ ఎంపిక చేసుకున్నాడేమో అనిపించింది. వరుణ్‌తేజ్ మామూలోడు కాదని గత సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ‘వాల్మీకి’ చూస్తే అసాధారణ నటుడు అనిపిస్తుంది. మా గురువు చిరంజీవిగారు, ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్.. వారి మధ్యలో ఉన్నాడు అర్జునుడు నాగబాబు.. అతను సంధించి వదిలిన బాణం మన వరుణ్. మా బాస్ వెంకటేశ్ ఉన్నాడు ఎదురుగా.. ‘సుందరకాండ’ దగ్గరి నుంచి చాలా సినిమాల్లో మా కాంబినేషన్లో చేశాం. ఆయన కొన్ని సినిమాలనే ఎంచుకుని అతిథిగా వస్తుంటారు. ‘వాల్మీకి’ సినిమాకి ముఖ్య అతిథిగా రావడం చాలా గొప్ప విషయం. రామ్ ఆచంట, గోపీ ఆచంట మంచి క్రమశిక్షణ, మనసున్నవారు. ‘వాల్మీకి’అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘పవన్‌కల్యాణ్‌గారితో ‘గబ్బర్‌సింగ్, సాయిధరమ్ తేజ్‌తో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్, బన్నీతో ‘డీజే’... ఇలా మెగా ఫ్యామిలీతో హిట్స్ కొట్టాడు హరీష్.. ఇప్పుడు వరుణ్‌తో కూడా ‘వాల్మీకి’తో హిట్ కొడుతున్నాడు. మా ‘ఎఫ్ 2’ వెంకటేశ్‌గారు ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చారు.. ‘ఎఫ్ 2’ లాగా ‘వాల్మీకి’ చిత్రానికీ తిరుగులేదు. ప్యాషన్ ఉన్న నిర్మాతలు గోపీ, రామ్. ‘వాల్మీకి’ పెద్ద హిట్ కావాలి.. ఆల్ ది బెస్ట్ టీమ్’’ అన్నారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘భాస్కరభట్లగారు ‘జర జర..’ పాట రాస్తున్నప్పుడు వాళ్ల అమ్మగారు చనిపోయారు.. అయినా రాసి ఇచ్చారు. చంద్రబోస్ అన్నయ్యగారితో నా సినిమాలో ఓ పాటైనా రాయించుకోకపోతే వెలితిగా ఉంటుంది. వనమాలిగారు చక్కనిపాట రాశారు. ఇతర భాషలతో పోలిస్తే రచయితలు, పాటల రచయితలకు మనం ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదేమో అనిపిస్తోంది. మనకు నచ్చిన పాటలు, లిరిక్స్‌ని తోటివారితో షేర్ చేసుకోండి. తద్వారా మన భాషను మనం కాపాడుకున్నవాళ్లం అవుతాం. కెమెరామెన్ బోస్, మిక్కీ జి. మేయర్ ఈ సినిమాకి రెండు స్తంభాల్లాంటివారు. నాకోసం ఈ సినిమాలో ప్రత్యేక పాట చేసినందుకు డింపుల్‌కి థ్యాంక్స్. ‘డీజే’ లో పూజాహెగ్డే గ్లామర్ నచ్చితే, ‘వాల్మీకి’లో తన నటన నచ్చుతుంది. ‘ఎఫ్ 2’ టైమ్‌లో వెంకటేశ్‌గారిని కలిశా. ఆయన్ని కలిసే వరకూ తెలియదు అంత సరదాగా ఉంటారని. 85రోజులు షూటింగ్ చేశాం.. ఇన్ని రోజులూ నవ్వుతూ పనిచేసిన నా మొదటి హీరో వరుణ్. ఈ కాలం జనరేషన్లో ఓ హీరో ఫోన్ పక్కన పెట్టి పనిపైనే శ్రద్ధ పెట్టేవాడు వరుణ్ ఒక్కడే. నెలరోజులు తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పాడు. డబ్బులు పెట్టేవారు చాలామంది ఉంటారు.. కానీ ప్యాషన్ ఉన్న నిర్మాతలు గోపీ ఆచంట, రామ్ ఆచంట, ‘దిల్’ రాజుగారు. వారం కిందట పవన్ కల్యాణ్‌గారిని కలిశా. ఆయనకి ‘వాల్మీకి’ ట్రైలర్ బాగా నచ్చింది. సినిమా గురించి తప్ప మిగతా అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ‘గబ్బర్‌సింగ్’ అప్పుడు ఎలా కోరుకున్నారో ఇప్పుడూ అదే సంకల్పంతో కోరుకోండి (పవన్ కల్యాణ్ అభిమానులను ఉద్దేశించి) అప్పుడే సినిమా కుదురుతుంది’’ అన్నారు. నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ– ‘‘ఇక్కడి విచ్చేసిన మెగాస్టార్, పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కి, మా తొలి సినిమా హీరో వెంకటేశ్‌బాబుకి థ్యాంక్స్. ఎప్పటి నుంచో వరుణ్‌తో సినిమా చేద్దామని రెండు మూడు కథలు అనుకున్నా, కుదరలేదు. ఇప్పుడు ‘వాల్మీకి’లాంటి మంచి కథతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. పవర్‌స్టార్‌తో ‘గబ్బర్‌సింగ్’ తీసి ఎలా అలరించారో వరుణ్‌తో ‘వాల్మీకి’ తోనూ అలా అలరిస్తారు హరీష్’’ అన్నారు. ‘‘నాకు శ్రీదేవిలాంటి మంచి పాత్ర ఇచ్చినందుకు హరీష్ సర్కి చాలా థ్యాంక్స్’’ అన్నారు పూజాహెగ్డే. నిర్మాత అనీల్ సుంకర, సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్, నటుడు బ్రహ్మాజీ, పాటల రచయితలు భాస్కరభట్ల, చంద్రబోస్, వనమాలి, నటి డింపుల్ పాల్గొన్నారు. -
శ్రీదేవి సైకిల్ ఎక్కారు
వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. 14రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఆదివారం పూజా హెగ్డే లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో పూజా కనిపించనున్నారు. -
గ్యాంగ్‌స్టర్ గానా బజానా!
సెటిల్మెంట్స్ చేయాల్సిన గ్యాంగ్‌స్టర్ సెట్లో స్టెప్పులేశాడు. ఇదంతా ‘వాల్మీకి’ సెట్లో జరిగిందని తెలిసింది. వరుణ్ తేజ్, అధర్వ ముఖ్యతారాగణంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజాహెగ్డే, మృణాళిని రవి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు వరుణ్. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ మాస్ సాంగ్‌ను చిత్రీకరించారని తెలిసింది. ఈ పాటకు వరుణ్ వేసిన స్టెప్స్ అదుర్స్ అని సమాచారం. అలాగే ఈ సినిమా చిత్రీకరణలో తొలిసారి పాల్గొన్నారు పూజా హెగ్డే. గురువారం పూజ వాల్మీకి సెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... తమిళ చిత్రం ‘జిగర్తండా’కు ఇది రీమేక్. ఓ గ్యాంగ్‌స్టర్ జీవితం ఆధారంగా సినిమా తీయాలని రియల్ గ్యాంగ్‌స్టర్ జీవితంతో ట్రావెల్ అయ్యే ఓ ఫిల్మ్ మేకర్ కథ ఆధారంగా ‘జిగర్తండా’ తెరకెక్కింది. ∙అధర్వ, వరుణ్ తేజ్ -
కాలేజీకి వేళాయె
కాలేజీకి వెళ్లడానికి బ్యాగ్‌లో బుక్స్ సర్దుకుంటున్నారు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. రియల్ లైఫ్‌లో కాదులెండీ. రీల్ లైఫ్‌లో. తమిళ యువ నటుడు అధర్వ హీరోగా కన్నన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో కథానాయికగా అనుపమా పరమేశ్వరన్‌ను తీసుకున్నారు. ఈ సినిమాలో ఇంజినీరింగ్ స్టూడెంట్ కమ్ భరతనాట్యం డ్యాన్సర్‌గా నటించనున్నారు అనుపమా పరమేశ్వరన్. హీరో అధర్వ పీహెచ్డీ స్కాలర్‌గా పాత్ర చేయనున్నారు. ‘‘ఈ సినిమా షూటింగ్‌ను ఎక్కువ శాతం విదేశాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేశాం. యూఎస్, ఆస్ట్రేలియాలో మేజర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని కంప్లీట్ చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’’ అని దర్శకుడు పేర్కొన్నారు. అనుపమ తమిళంలో చేస్తున్న రెండో చిత్రం ఇది. ఇంతకుముందు ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన ‘కొడి’ సినిమాలో ఆమె ఒక హీరోయిన్గా నటించారు. -
స్మాల్ బ్రేక్
నిన్నమొన్నటి వరకూ మండుతున్న ఎండల్ని కూడా లెక్క పెట్టకుండా షూటింగ్ చేశారు ‘వాల్మీకి’ అండ్ టీమ్. అందుకే ప్రస్తుతం స్మాల్ బ్రేక్ తీసుకున్నారని తెలిసింది. హరీష్‌శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమాలో డబ్ స్మ్యాష్ ఫేమ్ మృణాళిని రవిని హీరోయిన్గా తీసుకున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమ్ స్మాల్ బ్రేక్ తీసుకున్నారు. మళ్లీ ఈ నెల 17నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని, సినిమాలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది. తమిళ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కి ‘వాల్మీకి’ తెలుగు రీమేక్ అని సమాచారం. సో...‘వాల్మీకి’ చిత్రంతో వరుణ్‌తోపాటు మరో హీరో నటిస్తారు. ఈ పాత్రలో తమిళ హీరో అధర్వ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తారు. ఈ సినిమా కాకుండా కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడితోనూ ఓ సినిమా చేయనున్నారు వరుణ్ తేజ్. -
అన్నయ్యతో కలిసి...
తమిళనాట ఎంతో పాపులారిటీ సంపాదించిన నటుడు, రాజకీయ నాయకుడు ఎం.ఆర్. రాధా. ఆయన వారసుడు రాధారవి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు. ఇక రాధిక అప్పట్లో కథానాయికగా, ఇప్పుడు క్యారెక్టర్ నటిగా, నిర్మాతగా సంపాదించుకున్న పేరు గురించి తెలిసిందే. 1980లలో ఎన్నో సినిమాల్లో ఈ అన్నాచెల్లెళ్లు ఆన్ స్క్రీన్ కూడా అన్నాచెల్లెళ్లుగా నటించారు. లేటెస్ట్గా ఓ తమిళ సినిమా కోసం ఈ ఇద్దరూ మళ్లీ స్క్రీన్‌పై బ్రదర్ అండ్ సిస్టర్‌గా కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అధర్వ మురళీ హీరోగా శ్రీ గణేష్ తెరకెక్కించనున్న ‘కురుది అట్టమ్’లో రాధిక, రాధారవి చాలా గ్యాప్ తర్వాత కలిసి యాక్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు తెలియజేస్తూ – ‘‘రాధిక, రాధారవి మా సినిమాకు కచ్చితంగా స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. ఆ క్యారెక్టర్స్ రాసుకున్నప్పటి నుంచీ వీళ్లను తప్ప వేరే వాళ్లను ఊహించుకోలేదు. ఇద్దరికీ నా కథ నచ్చి ఒప్పుకోవడం నాకు చాలా గ్రేట్ మూమెంట్’’ అని పేర్కొన్నారు. -
ప్రియుడి కోసం ఒక చిత్రం
తమిళసినిమా: భర్తను హీరోగా పరిచయం చేయడం కోసమో, సోదరులను నిర్మాతలుగానో, నటులు గానో పరిచయం చేయడం కోసమో హీరోయిన్లు చిత్ర నిర్మాణం చేపట్టడం అన్నది సాధారణంగా జరుగుతున్నదే. కాగా అగ్రనటి నయనతార కూడా ఇప్పుడు అదే బాట పట్టనున్నారనే ప్రచారం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలతో పాటు స్టార్ హీరోలతోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఆ మధ్య అరమ్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఆమెకు చాలా మంచి పేరును తెచ్చి పెట్టింది. ఆ చిత్రానికి నిర్మాత ఆమె మేనేజర్ అని చెప్పినా, తరువాత పెట్డుబడి అంతా నయనతారదేననే ప్రచారం జరిగింది. దీన్ని ఎవరూ ఖండించలేదు కూడా. ఇప్పుడు ఈ సంచలన నటి నేరుగానే చిత్ర నిర్మాణంలోకి దిగుతోందన్నది తాజా సమాచారం. తన ప్రియుడుగా ప్రచారంలో ఉన్నదర్శకుడు విఘ్నేశ్‌శివ కోసం నయనతార ఒక చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అయినట్లు టాక్. విఘ్నేశ్‌శివ సూర్య హీరోగా చేసిన తానాసేర్నద కూటం చిత్రం తరువాత మరో చిత్రం కమిట్ కాలేదు. తాజాగా నయనతార నిర్మించనున్న చిత్రానికి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారట. ఇందులో యువ నటుడు అధర్వ హీరోగా నటించనున్నారని, దీనికి ఇదయం మురళి అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే నయనతార, అధర్వ కలిసి ఇమైకా నోడిగళ్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. కాగా తన ప్రియుడి కోసం తాను నిర్మించే చిత్రంలో ఆమె నటిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి. అసలు ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. -
అవకాశాల కోసం తప్పలేదు..!
తమిళ సినిమా: సినీ రంగంలో క్రేజ్ ఉన్నంత వరకే అవకాశాలైనా, డిమాండ్ అయినా.. క్రేజ్ తగ్గకూడదంటే సక్సెస్ చాలా అవసరం. సక్సెస్ లేకుంటే దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడరు. నటి హన్సిక విషయానికే వస్తే ఆదిలో విజయాలు దరి చేరకపోయినా, ఆ తరువాత సక్సెస్ఫుల్ నాయకిగా పేరు తెచ్చుకుంది. విజయ్, విశాల్, జయంరవి లాంటి స్టార్ హీరోలతో జత కట్టి మంచి ఇమేజ్ సంపాదించుకోవడంతో పాటు దర్శకుల నటిగా పేరు తెచుకుంది. ఆ తరువాత నటించిన చిత్రాలు హిట్ అయినా ఎందుకో గానీ అవకాశాలే పలచబడ్డాయి. ప్రభుదేవాతో నటిస్తున్న గులేబకావిళి చిత్రం మినహా చేతిలో మరో చిత్రం లేని పరిస్థితి. సరిగ్గా ఇలాంటి తరుణంలో అధర్వతో నటించే అవకాశం తలుపు తట్టింది. అజిత్ హీరోగా చిత్రం చేయాలన్న నిర్ణయంతో చిత్రం నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆరా సంస్థ ఆయన కాల్షీట్స్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఇతర చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలెట్టారు. ఈ సంస్థ తాజాగా జై, అంజలి, జననీఅయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన బెలూన్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పుడు అధర్వ హీరోగా చిత్ర నిర్మాణం తలపెట్టారు. డార్లింగ్, ఇనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు చిత్రాల ఫేమ్ శ్యామ్ అంటని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హన్సికను నాయకిగా ఎంపిక చేశారు. అధర్వ, హన్సిక జంట కడుతున్న తొలి చిత్రం ఇదే. ఇంతకు ముందు రూ.కోటి వరకూ పుచ్చుకున్న ఈ అమ్మడు పారితోషికం తగ్గించుకోవడం వల్లనే ఈ అవకాశాన్ని పొందించనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై హన్సిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. -
పరదేశీ మూవీ స్టిల్స్