స్మాల్‌ బ్రేక్‌ | Jigarthanda remake Valmiki | Sakshi
Sakshi News home page

స్మాల్‌ బ్రేక్‌

Published Sat, May 11 2019 12:32 AM | Last Updated on Sat, May 11 2019 12:32 AM

Jigarthanda remake Valmiki - Sakshi

వరుణ్‌ తేజ్‌,మృణాళిని రవి

నిన్నమొన్నటి వరకూ మండుతున్న ఎండల్ని కూడా లెక్క పెట్టకుండా షూటింగ్‌ చేశారు ‘వాల్మీకి’ అండ్‌ టీమ్‌. అందుకే ప్రస్తుతం స్మాల్‌ బ్రేక్‌ తీసుకున్నారని తెలిసింది. హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమాలో డబ్‌ స్మ్యాష్‌ ఫేమ్‌ మృణాళిని రవిని హీరోయిన్‌గా తీసుకున్నారు.  ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం టీమ్‌ స్మాల్‌ బ్రేక్‌ తీసుకున్నారు. మళ్లీ ఈ నెల 17నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని, సినిమాలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది. తమిళ హిట్‌ చిత్రం ‘జిగర్తాండ’కి ‘వాల్మీకి’ తెలుగు రీమేక్‌ అని సమాచారం. సో...‘వాల్మీకి’ చిత్రంతో వరుణ్‌తోపాటు మరో హీరో నటిస్తారు. ఈ పాత్రలో తమిళ హీరో అధర్వ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తారు. ఈ సినిమా కాకుండా కిరణ్‌ కొర్రపాటి అనే నూతన దర్శకుడితోనూ ఓ సినిమా చేయనున్నారు వరుణ్‌ తేజ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement