mrinalini
-
కాలాన్ని మంచి చేసుకోవాలి!
కాలం మనల్ని వెక్కిరిస్తూ ముందుకు పరిగెత్తుతూంటుంది. మనం దానితోపాటు నడవలేం. దాన్ని ఆపలేం. దాని వెంట పరిగెత్తనూలేం. చేయగలిగిందల్లా దాన్ని వీలైనంత ‘మంచి’ చేసుకోవడమే. అంటే దాన్ని సరిగ్గా వాడుకోవడమే. దాని వేగాన్ని తగ్గించలేక పోయినా దాని విలువను గుర్తించడం మన చేతుల్లోనే ఉందని తెలుసుకోవాలి.‘నాకు సమయం లేదు’ అనీ, ‘రోజులు గడిచిపోతున్నాయి. చాలా చెయ్యాలనుకున్నా. ఏమీ చెయ్యలేకపోయా’ అనీ, ‘ఉన్న సమయమంతా ఇంకొకళ్ల కోసమే అయిపోతోంది. ఇక నా కోసం ఏం చేసుకోడానికైనా టైం ఏదీ’ అనీ, ‘ఇల్లు, ఆఫీసు... ఈ రెండిటితోనే సరిపోతుంది. ఇంకేమీ చెయ్యలేను బాబూ’... ఇలాంటి మాటలు ఎంత తరచుగా వింటామో! ఈ మాటలు చాలా మంచి ‘సాకులు’. అవి కఠోర వాస్తవాలని మనల్ని మనం మభ్యపెట్టుకోవచ్చుగానీ నిజానికి అవి మనం ‘మనకు నచ్చిన పని చెయ్యకుండా, మనం చెయ్యాల్సిన పని చెయ్యకుండా’ తప్పించుకోడానికి కల్పించుకునే సాకులే. కాలం అందరికీ ఒకటే. ఎవరికైనా రోజులో ఉన్నవి ఇరవై నాలుగ్గంటలే. కొందరు రోజుకు పది పనులు అవలీలగా చేసేస్తారు; మరికొందరు ఒకటిన్నర పనితో సరిపెట్టుకుంటారు. ఈ తేడాకు కారణం మరొకరిపై తోసేయడం సుళువు. దానికి మనం ఎంతవరకు కారణమో ఆలోచించడం నేర్పు. ఇప్పటి ఆడవాళ్లకు అవసరమైంది ఈ నేర్పే. ‘సుళువు’లు చాలా ఏళ్లగానే వాడుకుంటున్నాం. ఇక మన నేర్పును చూపించే వేళ ఆసన్నమైంది. కొంత వెనక్కి వెళ్లి చూస్తే– మనలో మంచి చిత్రకారిణి ఉంది; పాటగత్తె ఉంది; సమాజ సేవకురాలు ఉంది; రచయిత్రి ఉంది; నృత్యకారిణి వుంది; నాయకురాలు ఉంది; వ్యాపారవేత్త ఉంది; దానికి పదును పెట్టాలన్న కోరికా ఉంది. కానీ లేనిదల్లా ఆ పదును పెట్టడానికి సమయమే. ఎందుకంటే వీటితో పాటే ‘నువ్వు ఏదైనా చెయ్యి కానీ నీ ఇంటి బాధ్యతలు పూర్తి చేశాకే’ అని తర్జని చూపించే కుటుంబమూ ఉంది. ‘ఆవిడ అంత పేరు తెచ్చుకుందంటే ఇల్లొదిలి తిరిగింది కాబట్టేగా’ అని మూతి విరిచే సమాజమూ ఉంది. ఇప్పుడు ఆ కుటుంబాన్నీ, సమాజాన్నీ నోటితో కాకపోయినా నొసలుతో వెక్కిరించే చైతన్యం ఎంతో కొంత మనకు అబ్బింది. అయినా అనుకున్నంతగా, మన సామర్థ్యానికి తగినంతగా సాధించలేకపోతున్నాం. ప్రతి పనినీ ‘వాయిదాలు’ వేస్తాం. వాయిదా వేయడానికి కనిపించినన్ని కారణాలు, ఉపయోగించేంత తెలివి తేటలు, పని చెయ్యడానికే వెచ్చిస్తే ఎంత బాగుంటుంది! అలా కూర్చునీ, కూర్చునీ ‘వయసైపోతోంది. ఏం సాధించాను ఈ జీవితంలో?’ అని నిస్పృహగా ప్రశ్నించుకుంటున్నాం. ‘నాలో ఎంతో ప్రతిభ ఉంది. ఏమీ ప్రతిభ లేని వాళ్లు ముందుకు వెళ్లిపోతున్నారు. నేనింకా వెనకబడే ఉన్నాను’ అని వాపోతున్నాం. గుర్తింపు కోసం, అవార్డుల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, బిరుదుల కోసం తహతహలాడటం మానుకోలేకపోతున్నాం. మన మానసిక సంతృప్తి వల్ల లభించే ‘విజయం’ మరే వేదికల వల్లా రాదని గుర్తించలేక పోతున్నాం. ఆ సంతృప్తిని సాధించే సమయం కూడా మన వద్ద ఉండటం లేదు. ఎందువల్ల? కాలాన్ని వాడుకోవడం చేతకాకపోవడం వల్ల; కాలం పట్ల భయమే తప్ప గౌరవం, ఇష్టం లేకపోవడం వల్ల. ఏం జరుగుతోందో అర్థమయ్యాక దాన్ని తట్టుకునేందుకూ లేదా అధిగమించేందుకూ ఏం చెయ్యాలో కూడా ఆలోచించాలి. మనం రోజులో ఎంత సమయం ఎలా వృథా చేస్తున్నామో తెలుసుకోవాలి. వంట చెయ్యడం, ఇంటి పనులు, పిల్లల పనులు చెయ్యడం కాదు వృథా చెయ్యడమంటే. సమయం వృథా చెయ్యడమంటే కాలాన్ని అగౌరవ పరచడం. అది ఎలా చేస్తున్నాం? ఇతరుల గురించి ఆలోచించడం; ఇతరుల పట్ల ఈర‡్ష్యను పెంచి పోషించడం; ఇతరుల జీవితాల్లో ఎన్ని లొసుగులున్నాయో వాకబు చెయ్యడం; మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో సామాజిక మాధ్యమాల్లో వెతుక్కోవడం; మనల్ని ఎంతమంది మెచ్చుకుంటున్నారో తెలుసుకుని గంటల తరబడి ఆనందించడం; ఎంతమంది తిడుతున్నారో తెలుసుకుని కుంగిపోవడం; లేదా శాపనార్థాలు పెట్టుకోవడం; మనకిష్టం లేని వాళ్లను ఎలా భ్రష్టు పట్టించాలో పన్నాగాలు వేయడం; అస్మదీయులతో బృందాలను ఏర్పరచుకుని వారితో పేరంటాలు, పండగలు చేసు కోవడం; మనకు ఉత్తరోత్తరా పనికి వచ్చే వాళ్లతో స్నేహాల కోసం ప్రయత్నించడం; మనల్ని బాధపెట్టిన వాళ్ల గురించి, మనకు నచ్చని వాళ్ల గురించి గంటల తరబడి ఫోన్లలో సంభాషణలు చేయడం; మన బాధ ప్రపంచపు బాధ అనుకుని అందరికీ మన గోడు, మనకు జరిగిన అన్యాయాలనూ వినిపించుకోవడం; ఈ ప్రపంచానికి మనల్ని అవమానించడం మినహా మరో పని లేదనే భ్రమలో జీవించడం. ఇదంతా ఇప్పటి మధ్య వయస్కుల తరం కాలాన్ని గడిపే వైనం. మరి ‘కాలం’ బాధపడదూ? మనకు మేలు చెయ్యాలని ఉన్నా ఎందుకులే ఈ మొహాలకు అని మొహం చాటేయదూ? తాము పుట్టడమే ఈ లోకానికి మహోపకారమనుకునే అహంభావుల కోసం తనెందుకు ఆగాలని అనుకోదూ? కనక, మన జీవితాలను బాగుపరచుకోడానికి గొప్ప అవకాశం ఇచ్చే అనంతమైన కాలాన్ని కొత్త సంవత్సరం నుంచి అయినా ఒక్క చిటికెడు, దోసెడు గౌరవిద్దాం.డా‘‘ మృణాళిని వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి, ఆచార్యులు -
నేడు తెలంగాణ ఎడ్‌సెట్
నల్లగొండ రూరల్: రెండు సంవత్సరాల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకోసం గురువారం నిర్వహించే తెలంగాణ ఎడ్‌సెట్–2024కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎడ్‌సెట్ కన్వినర్ ఆచార్య తాళ్ల మృణాళిని తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని తెలిపారు. మొదటి సెషన్లో 16,929 మంది, రెండో సెషన్లో 16,950 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 79 పరీక్ష కేంద్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూల్, విజయవాడ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://edcet.tsche.ac.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మొదటి సెషన్ పరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకల్లా, రెండో సెషన్ పరీక్షకు హాజరయ్యేవారు మధ్యాహ్నం 12:30 కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.ఉదయం పరీక్ష కేంద్రాలకు 10 గంటల తర్వాత, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోరని తెలియజేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి రెండోసారి ఎడ్‌సెట్ నిర్వహిస్తున్నట్లు ఎడ్‌సెట్ చైర్మన్ ఆచార్య గోపాల్‌రెడ్డి తెలిపారు. -
మావయ్యగారి బయోపిక్‌లో నటించాలనుంది
‘‘మామా మశ్చీంద్ర’ చిత్రం మెంటల్‌గా, ఫిజికల్‌గా నాకు ఓ సవాల్. కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమా ఇది. ఫ్యామిలీతో కలసి హాయిగా చూడొచ్చు’’ అని హీరో సుధీర్ బాబు అన్నారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా, ఈషా రెబ్బా, మృణాళినీ రవి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు చెప్పిన విశేషాలు. ► నా కెరీర్లో ఇప్పటివరకూ నా వద్దకు వచ్చిన కథల్లో నాకు నచ్చినవి చేశాను. కానీ, ఫలానా జానర్, ఫలానా కథ కావాలంటూ దర్శకులను అడగలేదు. ‘మనం, గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాలతో మంచి రైటర్‌గా నిరూపించుకున్నారు హర్ష. ఆయనపై ఉన్న నమ్మకంతో కథ తీసుకురమ్మని చెప్పాను. హర్ష చెప్పిన ‘మామా మశ్చీంద్ర’ కథ చాలా నచ్చింది. హర్ష మంచి రచయిత, నటుడు. మంచి అనుభవం ఉన్న దర్శకుడిలా ఆయన ఈ సినిమా తెరకెక్కించారు. ► ఈ సినిమాలో నేను చేసిన మూడు పాత్రల్లో (దుర్గా, పరశురాం, డీజే) ఒక్కో పాత్ర ఒక్కో యాస (తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ) మాట్లాడుతుంది. పరశురాం పాత్ర కోసం బరువు పెరిగాను. దుర్గ పాత్రకు ప్రోస్థటిక్స్ వాడాం. ఈ పాత్ర కోసం నిజంగా బరువు పెరగాలనుకున్నాను. అయితే ఒక్కసారిగా అంత బరువు పెరగడం మంచిది కాదని మహేశ్ బాబుగారితో పాటు సన్నిహితులు చెప్పడంతో ప్రోస్థటిక్ మేకప్‌ని వాడాం. డీజే పాత్ర కోసం డైట్ పాటించాను. ► నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావుగార్లు ఈ సినిమాకి పూర్తి న్యాయం చేశారు. ‘మామా మశ్చీంద్ర’లో మా మావయ్య కృష్ణగారితో ఓ సీన్ చేయించాలనుకున్నాను. కానీ ఆయన దూరమయ్యారు. ఆయన లేకపోతే ఆ సన్నివేశానికి ప్రాధాన్యతే లేదు. అందుకే వేరే వారితో ఆ సీన్ తీయలేదు. నా ప్రతి సినిమా రిలీజ్ రోజు మావయ్య చూసి, ఫస్ట్ ఫోన్‌కాల్ చేసి మాట్లాడేవారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు. మావయ్యగారి బయోపిక్‌లో నటించే చాన్స్ వస్తే హ్యాపీగా చేస్తాను. ప్రస్తుతం నేను నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ డబ్బింగ్ జరుగుతోంది. నా కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘హరోం హర’ షూటింగ్ చేస్తున్నాం. పుల్లెల గోపీచంద్ బయోపిక్ కచ్చితంగా ఉంటుంది. -
మనం లాంటి అనుభూతి కలుగుతుంది – సుధీర్ బాబు
‘‘మామా మశ్చీంద్ర’లో త్రిపాత్రాభినయం చేశాను. ఏయన్నార్ ఫ్యామిలీ నటించిన ‘మనం’ చూసినప్పుడు అరుదైన సినిమాగా ఎలా అనుభూతి చెందారో, ‘మామా మశ్చీంద్ర’ చూశాక అలాంటి అనుభూతే కలుగుతుంది. ఈ సినిమాతో హర్షవర్ధన్ టాప్ డైరెక్టర్ అవుతారు’’ అన్నారు సుధీర్ బాబు. హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఇషా రెబ్బా, మృణాలినీ రవి హీరోయిన్లు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో మహేశ్ బాబు షేర్ చేశారు. ‘‘మనం’ రచయితగా మీ అందరి ప్రేమాభిమానాలు పొందాను. ఇంతకాలం విరామం తీసుకొని ‘మామా మశ్చీంద్ర’ చేయడానికి కారణం.. ప్రేక్షకుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని’’ అన్నారు హర్షవర్ధన్. ‘‘ఈ చిత్రంలో ప్రతి పదిహేను నిమిషాలకు ఒక మలుపు, సర్ర్పైజ్ వస్తుంది’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. -
మామ.. అల్లుడు వస్తున్నారు
సోహెల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. కె.అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమాని మార్చి 3న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘ఫ్యామిలీ, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
క్యారెక్టర్ ఉంటే తిరుగుండదు
‘‘యాక్టర్ కావటానికి నటన తెలిస్తే చాలు.. కానీ, సక్సెస్ఫుల్ యాక్టర్ కావాలంటే తప్పకుండా క్యారెక్టర్ కావాలి.. అది ఉంటే తిరుగుండదని ఈ తరం నటీనటులకు చెబుతున్నాను. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమా మార్చిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘వినోదం’ సినిమా తర్వాత నేను చేసిన కంప్లీట్ కామెడీ మూవీ ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ప్రేక్షకుల నవ్వులు చూసేందుకు ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. మీనా మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్‌గారితో 30ఏళ్ల తర్వాత ఈ మూవీలో చేశాను. కృష్ణారెడ్డిగారితో సినిమా చేసే అవకాశం ఇన్నేళ్లకు కుదిరింది. తొలిసారి ఒక లేడీ ప్రొడ్యూసర్‌తో (కల్పన) పని చేయడం హ్యాపీ’’ అన్నారు. ‘‘ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు కె. అచ్చిరెడ్డి. ‘‘ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు సోహైల్. -
Vishwa Mahila Navala: తొలి నవలా రచయిత్రులకు పూమాల
మహిళా సృజనకారుల గురించీ, వారి జీవించిన సమాజం గురించీ, వారి రచనా స్వేచ్ఛ గురించి పరిశోధించి పాఠకుల చేతిలో పండు వలిచి పెట్టినట్లు రాయడంలో ఎంత శ్రమ, శ్రద్ధ, ఆసక్తీ అవసరమో కదా. అటువంటి ఆసక్తీ, శ్రమా శ్రద్ధల సమ్మేళనమే మృణాళిని ‘విశ్వమహిళా నవల’. ఇందులో జాపనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లిష్, రష్యన్ భాషలలో తొలి నవలా రచయిత్రుల పరిచయం, వారి జీవించిన కాలంలో స్త్రీలకుండే పరిమితులూ, రచయిత్రుల జీవన శైలీ, రచనా శైలీ, వస్తువూ అన్నిటినీ విస్తృతంగా చర్చించారు మృణాళిని. ప్రపంచ సాహిత్యంలోనే మొదటి నవల రాసిన జాపనీస్ రచయిత్రి లేడీ మూరసాకీ (978–1014) నుంచి ఫ్రెంచ్ రచయిత్రి జార్జ్ సాండ్ (1804 –1876) వరకూ పదముగ్గురు రచయిత్రుల పరిచయం స్త్రీల సాహిత్య చరిత్రను మనముందు ఉంచుతుంది. లేడీ మూరసాకి వ్రాసిన ‘ది టేల్ ఆఫ్ గెన్జి’ ప్రపంచ భాషల్లోనే తొలి నవల అని విమర్శకులు గుర్తించారు. వెయ్యి పేజీల ఈ వచన రచన అప్పటికింకా ప్రాచుర్యంలో లేని నవలా ప్రక్రియను అవలంబించింది. 1వ శతాబ్దం మొదలు 19వ శతాబ్దం వరకూ ఆయా దేశాలలో ఉండే మహిళా రచయిత్రులు అక్కడి రాజకీయ పరిస్థితులు, సామాజిక నియమ నిబంధనలు, పితృస్వామ్యం... వీటన్నిటినీ తట్టుకుని నవలలు రాశారని ఈ పుస్తకం వల్ల తెలుస్తుంది. కొంతమంది రచయిత్రుల కృషి వారి జీవిత కాలంలో గుర్తింపబడకపోయినా... తరువాత కొంతమంది సద్విమర్శకుల వలన, స్త్రీవాదుల వలన గుర్తించబడింది. స్త్రీలు తమ స్వంత పేర్లతో రాయడానికి జంకి పురుషుల పేర్లతో రాయడం లేదా అనామకంగా రాయడం, ఎప్పుడైనా ధైర్యంగా రాయడం, రాజకీయాలను గురించి రాయడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం... చివరకు నెపోలియన్నే నిలదీసి ఆయన ఆగ్రహానికి గురి కావడం ఈ పుస్తకంలో చూస్తాం. త్రికోణ ప్రేమ కథలు, హారర్ కథలు రాసిన తొలి రచయిత్రులు కూడా వీరు అయ్యారు. పల్లె సీమల అందాలని రొమాంటిసైజ్ చేయడం కాక అక్కడి ప్రజా జీవనాన్ని చిత్రించారు. కొందరు రచయిత్రులు ప్రఖ్యాత పురుష రచయితలకు ప్రేరణ కూడా అయ్యారు. సమాజం విమర్శించే జీవన శైలులు కూడా అవలంబించారు. ఈ పుస్తకానికి ఓల్గా కూలంకషమైన పరిచయం రాశారు. రచయిత్రుల జీవన కాలం, రచనా కాలం, వారి జీవిత విశేషాలు, అనుభవాలు... ఏదీ వదలకుండా ఒక సంపూర్ణ చరిత్రను... అందులోనూ ప్రపంచ మహిళా రచయితల చరిత్రను ఇష్టంగా మనకు అందించిన మృణాళినికి అభినందలు లేదా కృతజ్ఞతలు అనేవి చాలా పేలవమైన మాటలు. ప్రస్తుతం అన్ని విశ్వ విద్యాలయాల్లో స్త్రీ అధ్యయన కేంద్రాలు ఉంటున్నాయి. ఆ కేంద్రాలలో ఈ పుస్తకం తప్పనిసరిగా ఉండాలి. (చదవండి: కళ్లు తెరిపించే కథా రచయిత్రి) ఇటువంటి వ్యాస సంపుటులు ఇంగ్లిష్‌లో ఉంటాయి కానీ తెలుగులో ఇదే మొదటిది అని అనుకుంటున్నాను. ఇంగ్లిష్‌కన్నా తెలుగులో చదువుకోవడం సులభం కనుక యిది సాహితీ ప్రేమికులకూ చరిత్ర అభిమానులకూ మంచి కానుక. మరొక విషయమేమిటంటే ఇందులో మృణాళిని ప్రతి విదేశీ పదానికీ సరి అయిన ఉచ్ఛారణ ఇచ్చారు. ధృతి పబ్లికేషన్స్ ప్రచురించిన ‘విశ్వ మహిళా నవల’ హైదరాబాద్‌లోని నవోదయలో కొనుక్కోవచ్చు. చదువుతూ నాణ్యమైన సమయం గడపవచ్చు. - పి. సత్యవతి ప్రముఖ రచయిత్రి -
స్మాల్ బ్రేక్
నిన్నమొన్నటి వరకూ మండుతున్న ఎండల్ని కూడా లెక్క పెట్టకుండా షూటింగ్ చేశారు ‘వాల్మీకి’ అండ్ టీమ్. అందుకే ప్రస్తుతం స్మాల్ బ్రేక్ తీసుకున్నారని తెలిసింది. హరీష్‌శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమాలో డబ్ స్మ్యాష్ ఫేమ్ మృణాళిని రవిని హీరోయిన్గా తీసుకున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమ్ స్మాల్ బ్రేక్ తీసుకున్నారు. మళ్లీ ఈ నెల 17నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని, సినిమాలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది. తమిళ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కి ‘వాల్మీకి’ తెలుగు రీమేక్ అని సమాచారం. సో...‘వాల్మీకి’ చిత్రంతో వరుణ్‌తోపాటు మరో హీరో నటిస్తారు. ఈ పాత్రలో తమిళ హీరో అధర్వ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తారు. ఈ సినిమా కాకుండా కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడితోనూ ఓ సినిమా చేయనున్నారు వరుణ్ తేజ్. -
వరుణ్‌కి జోడిగా డబ్ స్మాష్ బ్యూటీ
అంతరిక్షం సినిమాతో మరోసారి ఆకట్టుకున్న మెగా హీరో వరుణ్ తేజ్, తన తదుపరి చిత్రంలోనూ ప్రయోగానికే ఓకె చెప్పాడు. తమిళ సూపర్ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు వరుణ్. కమర్షియల్ చిత్రాల స్పెషలిస్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కు జోడిగా డబ్ స్మాష్ స్టార్‌ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. తమిళనాట డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిన మృణాలినీ రవిను వరుణ్‌కు జోడిగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
అడుగడుగునా సమస్యలే...
-
టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో రభస
హైదరాబాద్: అధికార తెలుగుదేశం పార్టీలో రోజురోజుకీ వర్గపోరు ముదిరిపోతోంది. తాజాగా సోమవారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చోటు చేసుకుంది. అక్కడ జరుగుతున్న టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో రసాభాస నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మృణాళిని సమక్షంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ చీఫ్ విప్ గద్దె బాబూరావు, జెడ్పీటీసీ వరహాలనాయుడు, ఎంపీపీ రౌతు కాంతమ్మ వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.