అంతరిక్షం సినిమాతో మరోసారి ఆకట్టుకున్న మెగా హీరో వరుణ్ తేజ్, తన తదుపరి చిత్రంలోనూ ప్రయోగానికే ఓకె చెప్పాడు. తమిళ సూపర్ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు వరుణ్. కమర్షియల్ చిత్రాల స్పెషలిస్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కు జోడిగా డబ్ స్మాష్ స్టార్‌ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. తమిళనాట డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిన మృణాలినీ రవిను వరుణ్‌కు జోడిగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment