Valmiki Teaser Release Date | Varun Tej and Harish Shankar Movie Teaser - Sakshi
Sakshi News home page

‘వాల్మీకి’ టీజర్‌ రెడీ!

Published Tue, Aug 13 2019 10:42 AM | Last Updated on Tue, Aug 13 2019 12:03 PM

VarunTej Valmiki Teaser on August 15th - Sakshi

మెగా హీరో వరుణ్ తేజ్‌ తొలిసారిగా ప్రతీనాయక పాత్రలో నటిస్తున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన జిగర్తాండ సినిమాను తెలుగులో వాల్మీకి పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ సినిమాకు దర్శకుడు. మరో కీలక పాత్రలో తమిళనటుడు అధర్వ మురళీ నటిస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే టైటిల్‌ లుక్‌లో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లతో ఆకట్టుకోగా స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగస్టు 15న టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 14 రీల్స్‌ ప్లస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement