‘‘మామా మశ్చీంద్ర’ చిత్రం మెంటల్‌గా, ఫిజికల్‌గా నాకు ఓ సవాల్. కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమా ఇది. ఫ్యామిలీతో కలసి హాయిగా చూడొచ్చు’’ అని హీరో సుధీర్ బాబు అన్నారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా, ఈషా రెబ్బా, మృణాళినీ రవి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు చెప్పిన విశేషాలు.
► నా కెరీర్‌లో ఇప్పటివరకూ నా వద్దకు వచ్చిన కథల్లో నాకు నచ్చినవి చేశాను. కానీ, ఫలానా జానర్, ఫలానా కథ కావాలంటూ దర్శకులను అడగలేదు. ‘మనం, గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాలతో మంచి రైటర్‌గా నిరూపించుకున్నారు హర్ష. ఆయనపై ఉన్న నమ్మకంతో కథ తీసుకురమ్మని చెప్పాను. హర్ష చెప్పిన ‘మామా మశ్చీంద్ర’ కథ చాలా నచ్చింది. హర్ష మంచి రచయిత, నటుడు. మంచి అనుభవం ఉన్న దర్శకుడిలా ఆయన ఈ సినిమా తెరకెక్కించారు.
► ఈ సినిమాలో నేను చేసిన మూడు పాత్రల్లో (దుర్గా, పరశురాం, డీజే) ఒక్కో పాత్ర ఒక్కో యాస (తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ) మాట్లాడుతుంది. పరశురాం పాత్ర కోసం బరువు పెరిగాను. దుర్గ పాత్రకు ప్రోస్థటిక్స్ వాడాం. ఈ పాత్ర కోసం నిజంగా బరువు పెరగాలనుకున్నాను. అయితే ఒక్కసారిగా అంత బరువు పెరగడం మంచిది కాదని మహేశ్ బాబుగారితో పాటు సన్నిహితులు చెప్పడంతో ప్రోస్థటిక్ మేకప్‌ని వాడాం. డీజే పాత్ర కోసం డైట్ పాటించాను.
► నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావుగార్లు ఈ సినిమాకి పూర్తి న్యాయం చేశారు. ‘మామా మశ్చీంద్ర’లో మా మావయ్య కృష్ణగారితో ఓ సీన్ చేయించాలనుకున్నాను. కానీ ఆయన దూరమయ్యారు. ఆయన లేకపోతే ఆ సన్నివేశానికి ప్రాధాన్యతే లేదు. అందుకే వేరే వారితో ఆ సీన్ తీయలేదు. నా ప్రతి సినిమా రిలీజ్ రోజు మావయ్య చూసి, ఫస్ట్ ఫోన్‌కాల్ చేసి మాట్లాడేవారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు. మావయ్యగారి బయోపిక్‌లో నటించే చాన్స్ వస్తే హ్యాపీగా చేస్తాను. ప్రస్తుతం నేను నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ డబ్బింగ్ జరుగుతోంది. నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘హరోం హర’ షూటింగ్ చేస్తున్నాం. పుల్లెల గోపీచంద్ బయోపిక్ కచ్చితంగా ఉంటుంది.
మావయ్యగారి బయోపిక్‌లో నటించాలనుంది
Published Thu, Oct 5 2023 4:19 AM | Last Updated on Thu, Oct 5 2023 4:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment