
తమిళ సినిమా: సినీ రంగంలో క్రేజ్ ఉన్నంత వరకే అవకాశాలైనా, డిమాండ్ అయినా.. క్రేజ్ తగ్గకూడదంటే సక్సెస్ చాలా అవసరం. సక్సెస్ లేకుంటే దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడరు. నటి హన్సిక విషయానికే వస్తే ఆదిలో విజయాలు దరి చేరకపోయినా, ఆ తరువాత సక్సెస్‌ఫుల్ నాయకిగా పేరు తెచ్చుకుంది. విజయ్, విశాల్, జయంరవి లాంటి స్టార్ హీరోలతో జత కట్టి మంచి ఇమేజ్ సంపాదించుకోవడంతో పాటు దర్శకుల నటిగా పేరు తెచుకుంది.
ఆ తరువాత నటించిన చిత్రాలు హిట్ అయినా ఎందుకో గానీ అవకాశాలే పలచబడ్డాయి. ప్రభుదేవాతో నటిస్తున్న గులేబకావిళి చిత్రం మినహా చేతిలో మరో చిత్రం లేని పరిస్థితి. సరిగ్గా ఇలాంటి తరుణంలో అధర్వతో నటించే అవకాశం తలుపు తట్టింది. అజిత్ హీరోగా చిత్రం చేయాలన్న నిర్ణయంతో చిత్రం నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆరా సంస్థ ఆయన కాల్‌షీట్స్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఇతర చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలెట్టారు.
ఈ సంస్థ తాజాగా జై, అంజలి, జననీఅయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన బెలూన్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పుడు అధర్వ హీరోగా చిత్ర నిర్మాణం తలపెట్టారు. డార్లింగ్, ఇనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు చిత్రాల ఫేమ్ శ్యామ్ అంటని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హన్సికను నాయకిగా ఎంపిక చేశారు. అధర్వ, హన్సిక జంట కడుతున్న తొలి చిత్రం ఇదే. ఇంతకు ముందు రూ.కోటి వరకూ పుచ్చుకున్న ఈ అమ్మడు పారితోషికం తగ్గించుకోవడం వల్లనే ఈ అవకాశాన్ని పొందించనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై హన్సిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment