
‘‘ఇదే నాన్న చెప్పిన విగ్రహం. దీనికి ఫారిన్‌లో సూపర్ డిమాండ్ ఉంది... నేను తెస్తాను నా శిల్పాన్ని’..., ‘వద్దురా.. ఆ ఊరే పెద్ద రిస్కు’..., ‘మీరు ముగ్గురూ కలిసి ఆ పెట్టెను కొట్టేయాలి’..., ‘ఏం.. మమ్మల్ని చూస్తే హీరోల్లా అనిపించట్లేదా?’..., ‘మా అన్నకు షుగర్ అని తెలీదా.. ఎందుకురా లాలీపాప్ పెట్టారు’..., ‘మీరూ మీ పొట్టలు.. మీ బండ నడుములు.., ఈయనది పేద్ద ఇలియానా నడుము మరి’..., ‘చనిపోయిన మా అబ్బాయి శ్రీనివాస్ నీలాగే ఉండేవాడు’..., ‘అప్పుడు ఆ నిధి ఏమైనట్టు’... వంటి డైలాగులు ‘గులేబకావళి’ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుతున్నాయి. ప్రభుదేవా, హన్సిక జంటగా నటి రేవతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గులేబకావళి’.
కల్యాణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఏప్రిల్ 6న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘గులేబకావళి గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. తమిళంలోలా తెలుగులోనూ మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్.
Comments
Please login to add a commentAdd a comment