
తమన్నా
రెగ్యులర్ సినిమాలతో పాటు రీమేక్ సినిమాలను అదే సంఖ్యలో చేస్తున్నట్టున్నారు తమన్నా. లేటెస్ట్‌గా ఓ తమిళ సినిమా హిందీ రీమేక్‌లో తమన్నా నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తండా’ హిందీలో రీమేక్ కాబోతోంది. తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్రలో ఆర్యన్ కార్తీక్, బాబీ సింహా చేసిన పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా నటిస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని అజయ్ దేవగణ్ నిర్మించనున్నారు.
ఇది మాత్రమే కాదు.. ఈ ఏడాది తమన్నా ఎక్కువ రీమేక్స్‌లో కనిపించనున్నారు. ఇటీవలే హిందీ ‘క్వీన్’ను తెలుగులో ‘దటీజ్ మహాలక్షి’గా రీమేక్ చేశారు. ఆ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది . ఆల్రెడీ తెలుగు సూపర్ హిట్ ‘ఆనందో బ్రహ్మా’ను ‘పెట్రోమాక్స్’ టైటిల్‌తో తమిళంలో రీమేక్ చేశారు. అందులో తమన్నా లీడ్ రోల్ చేశారు. ఇప్పుడు తమిళ ‘జిగర్తండా’ హిందీ రీమేక్‌లో తమన్నా నటిస్తున్నారు. ఇలా ఒకేసారి తెలుగు టు తమిళం టు హిందీ సినిమాల రీమేక్స్‌తో ప్రస్తుతానికి ‘రీమేక్ క్వీన్’ అయ్యారు తమన్నా.
Comments
Please login to add a commentAdd a comment