
ఆ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తాం!
చెన్నై: గ్యాంగ్ స్టర్ల కథాంశంగా సిద్దార్ధ హీరోగా తమిళంలో తెరకెక్కిన 'జిగర్థాందా' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తామని ఆ చిత్ర నిర్మాత కథిర్ సేన్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడిన సేన్.. ఆ చిత్రాన్ని హిందీలో చేయాలని అనుకోవడానికి బాలీవుడ్ లోని పలువురు ప్రముఖ నిర్మాతలు ఆసక్తి చూపడమే ప్రధాన కారణమన్నారు. ' ఆ చిత్ర రీమేక్ కు సంబంధించి హిందీ చిత్ర సీమ నుంచి చాలా కాల్స్ వచ్చాయి. చాలా మంది ఈ చిత్రాన్ని హిందీలో చేయమని అడుగుతున్నారు. ఇంకా అందుకు సంబంధించి తుది నిర్ణయం అయితే తీసుకోలేదు'అని కథిర్ సేన్ తెలిపారు. ఇంకా ఎటువంటి పేపర్ వర్క్ కూడా జరగలేదన్నాడు.
ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ అనే వాడు ఎలా ఉంటాడో అనేది వాస్తవానికి దగ్గరగా ఉంటుదన్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించిన ఈ సినిమా కొన్ని నెలలు వాయిదా అనంతరం ఆగస్టు 1 వ తేదీన తమిళంలో విడుదల చేశామన్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.10 కోట్లను వసూలు చేసి తమిళనాడు బాక్సాఫీస్ ను తిరగరాసిందన్నాడు.