బాగ్దాద్: ప్రధాని పదవికి రాజీనామా చేస్తానంటూ ఇరాక్ ప్రధాని అదెల్ అబ్దుల్ మహ్తి శుక్రవారం ప్రకటించారు. తన రాజీనామాను పార్లమెంటుకు సమర్పిస్తానని, దాంతో పార్లమెంటు ఇతర అవకాశాలను పరిశీలించుకుంటుందని చెప్పారు. ఇరాక్ ప్రధానికి మద్దతు ఉపసంహరించుకోవాలంటూ చట్టసభ సభ్యులకు అత్యున్నత షియా మతగురువు పిలుపునివ్వటంతో రెండు నెలలుగా అల్లర్లు జరుగుతున్నాయి. అల్లర్లలో 400 మంది మృతి చెందగా, 15 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment