అమెరికాలోని పలు రాష్ట్రాల్లో అల్లర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపడుతున్న సమయంలో అక్కడి పలు రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగాయి. ట్రంప్ వ్యతిరేకులు పలుచోట్ల ఆందోళనలకు దిగారు. మాకోద్దీ అధ్యక్షుడు అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. నల్లదుస్తులు ధరించి పలు బిల్డింగ్‌ల అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
ట్రంప్ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి 50 మంది ప్రముఖ డెమోక్రాట్ నేతలు గైర్హాజరరు కావడం గమనార్హం. మరో వైపు అమెరికాను గొప్పగా తీర్చిదిద్దేందుకు పని మొదలైందంటూ ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రంప్ ట్వీట్ చేశారు.