ఫ్రాన్స్‌లో గత నెలలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడన్న ఆరోపణలపై ఒక యువకుడిపై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఫ్రాన్స్‌ను ఒక్క కుదుపు కదుపేసింది. ఒక్కరాత్రిలో ఫ్రాన్స్ రణరంగంలా మారిపోయింది. మైనార్టిలపై పోలీసులు అకృత్యాలు కొత్తేమి కాదంటూ ప్రజాగ్రహం ఒక్కసారిగా కట్టలు తెచ్చుకుంది. ఆ యువకుడిని చంపడాన్ని నిరశిస్తూ పౌరులు పెను విధ్వంసమే సృష్టించారు. పోలీసులు కావలనే ఇలా చేశారంటూ ప్రజలు మండిపడ్డారు. ఒక్కసారిగా ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాలు ఉద్రిక్తంగా మారిపోయాయి.
దీంతో వేలాది మంది యువతీయువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టారు. దీంతో దేశం ఒక్కసారిగా అగ్ని గుండలా మారిపోయింది. నాటి ఘటనలో పరిస్థితిని అదుపు చేసేందకు పోలీసులు వేలాదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు ఆరోపణలు మోపి అరెస్టు చేశారు. ఈ మేరకు ఫ్రాన్స్ కోర్టుల వారిపై మోపిన అభియోగాలను విచారించి నాటి ఘటనలో అల్లర్లకు పాల్పడిని సుమారు 700 మందికి జైలు శిక్ష విధించింది.
వారంతా పోలీసు అధికారులపై దాడిచేయడం, ప్రభుత్వా ఆస్తులను పాడుచేయడం తదిత వాటిల్లో దోషులుగా నిర్థారించి ఈ శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి మాట్లాడుతూ..న్యాయస్థానం నాటి ఘటనపై సీరియస్‌గానే స్పందించింది. దేశ శాంతి భద్రతలకే కోర్టు ప్రాముఖ్యతనిస్తుంది. ఇలాంటి విషయంలో కోర్టు కఠినంగానే వ్యవహరిస్తుందని అన్నారు. కాగా, ఫ్రాన్స్‌లో ఇలాంటి ఘటనలు కొత్తేమి గాదు గతంలో కూడా ఇలాంటి పలు ఉదంతాలు చోటు చేసుకోవడం గమనార్హం.
(చదవండి: అమ్మా! తల్లి ఏం డేరింగ్?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్‌లో..)
Comments
Please login to add a commentAdd a comment