ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగిన మెయిటీ వర్గం నిరసనకారులు
ఇంఫాల్: మణిపూర్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివారం చెలరేగిన హింసాకాండలో పదిహేను ఇళ్లు తగలబడ్డాయి. లంగోల్ గేమ్స్ విలేజ్‌లో అల్లరిమూక దాడులకు తెగబడి ఇళ్లను తగులబెట్టారు. దీంతో భద్రతా సిబ్బంది బాష్పవాయువుని ప్రయోగించి పరిస్థితుల్ని అదుపులోనికి తీసుకువచ్చారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చెకోన్ ప్రాంతంలో దుండగులు వాణిజ్య సముదాయాలను తగులబెట్టారు. మరోవైపు రాజకీయంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్డీయేలో ఇన్నాళ్లూ భాగస్వామ్యపక్షంగా ఉన్న కుకీ పీపుల్స్ అలయెన్స్ బైరన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది.
లూటీ చేసిన ఆయుధాలు వెనక్కి
మణిపూర్‌లో అల్లరిమూకలు భారీగా లూటీ చేసిన ఆయుధాల్ని తిరిగి స్వా«దీనం చేసుకునే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు లూటీ అయిన ఆయుధాల్లో 1,195 తిరిగి స్వా«దీనం చేసుకున్నట్టు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. మణిపూర్ లోయ ప్రాంతం జిల్లాల నుంచి 1,057 ఆయుధాలు , కొండ ప్రాంతం జిల్లాల నుంచి 138 ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు ఐజీ ర్యాంకు అధికారి ఒకరు ఆయుధాగారాల లూటీకి సంబంధించి విచారణ జరుపుతున్నారు.
అయిదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు
ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన హేయమైన ఘటనలో అయిదురుగు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ ప్రాంతం పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ సహా అయిదుగురు సిబ్బందిని దీనికి సంబంధించిన వీడియో బయటకి వచి్చన వెంటనే సస్పెండ్ చేసినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ఒక వర్గం ప్రజలు వారి సస్పెన్షన్‌ని వెనక్కి తీసుకోవాలని ప్రతీరోజూ పోలీసు స్టేషన్ ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా వెనక్కి తగ్గలేదని చెప్పారు.
జంకుతున్న ఎమ్మెల్యేలు
ఈ నెల 21 నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడానికి కుకీ వర్గానికి చెందిన అత్యధిక ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి హాజరుకావడానికి విముఖతతో ఉన్నారు. జాతుల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతూ ఉండడంతో తమకి భద్రత లేదని వారు భయపడుతున్నారు. శాంతి భద్రతలు అదుపులో లేకపోవడం వల్ల తాము అసెంబ్లీకి హాజరు కావడం లేదని కుకి వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎల్.ఎమ్ ఖాటే చెప్పారు. ఎమ్మెల్యేల ఇంఫాల్ ప్రయాణం సురక్షితం కాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment