Security actions
-
దేశంలో భద్రత గుర్తింపు పొందిన తొలి కంపెనీ
టెలికమ్యునికేషన్ సేవలందిస్తున్న వొడాఫోన్-ఐడియా(వీఐ) ప్రతిష్టాత్మక ‘పీసీఐ డీఎస్ఎస్ 4.0’ సర్టిఫికేషన్ పొందినట్లు తెలిపింది. దాంతో ఈ ఘనత సాధించిన తొలి భారత కంపెనీగా గుర్తింపు పొందింది. కస్టమర్ల డిజిటల్ లావాదేవీలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నందుకు ఈ గుర్తింపు లభించిందని కంపెనీ పేర్కొంది.సిమ్‌కార్డు ఆధారంగానే డిజిటల్ లావాదేవీలు చేస్తూంటారు. మోసపూరిత చెల్లింపులను నివారించి, కస్టమర్ డేటాను భద్రంగా ఉంచడంలో పకడ్బందీ చర్యలు పాటిస్తున్నట్లు వీఐ తెలిపింది. కంపెనీ రిటైల్‌స్టోర్స్, పేమెంట్ ఛానల్స్‌కు సంబంధించి ఈ చర్యలు చేపట్టినందుకు పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్ వెర్షన్ 4.0 (పీసీఐ డీఎస్ఎస్ 4.0) సర్టిఫికేషన్ పొందినట్లు వెల్లడించింది. దాంతో భారత్‌లో ఈ ప్రతిష్టాత్మక సర్టిఫికేషన్ పొందిన తొలి టెలికం ఆపరేటరుగా వొడాఫోన్-ఐడియా నిలిచింది.ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ మాట్లాడుతూ..‘అత్యుత్తమ గ్లోబల్ సెక్యూరిటీ ప్రమాణాలకు సంస్థ కట్టుబడి ఉంది. కస్టమర్ల డేటా భద్రతకు కంపెనీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పీసీఐ డీఎస్ఎస్ 4.0 సర్టిఫికేషన్ పొందడమనేది పకడ్బందీ భద్రతా చర్యలను పాటించడంలో మాకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. భారత్‌లో ఈ సర్టిఫికేషన్ పొందిన తొలి టెలికం సంస్థగా నిలవడం సంతోషకరం. పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు, అధునాతన సెక్యూరిటీ టెక్నాలజీలపై పెట్టుబడి పెట్టేందుకు సంస్థ సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.ఇదీ చదవండి: ‘పది కోట్లమంది ప్రయోజనాలు కాపాడుతాం’పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ(పీసీఐ) సెక్యూరిటీ స్టాండర్డ్స్ కౌన్సిల్‌ను ప్రారంభించింది. డేటా ఉల్లంఘనలు, క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలకు సంబంధించిన మోసాలు గుర్తించడం, వాటికి అందించే భద్రత చర్యలు, అందుకోసం సంస్థలు పాటించే అత్యంత కఠినతరమైన, అప్-టు-డేట్ సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను ఇది సూచిస్తుంది. భారత్‌లోని బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు తప్పనిసరిగా పీసీఐ డీఎస్ఎస్ 4.0 సర్టిఫికేషన్ పొందాలని ఇప్పటికే ఆర్బీఐ మార్గదర్శకాల్లో నిర్దేశించింది. -
పెద్దిరెడ్డికి 2+2 భద్రత కల్పించండి: హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గతంలో మాదిరిగా యథాతధంగా 2+2 భద్రతను కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది.కాగా, గతంలో తనకు కల్పించిన భద్రతను యథాతధంగా కొనసాగించాలంటూ పెద్దిరెడ్డి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు పెద్దిరెడ్డి పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రాణహాని నేపథ్యంలో పెద్దిరెడ్డికి 2+2 భద్రతను కల్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.ఇక, విచారణ సమయంలో.. ప్రాణహాని నేపథ్యంలో దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారని గుర్తు చేస్తూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల పాటు లేదా ఎస్ఆర్సీ నివేదిక వచ్చేంత వరకు పెద్దిరెడ్డికి 2+2 భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.ఇదిలా ఉండగా.. ఎంఆర్‌పల్లిలో తమ భూముల్లో నిర్మించుకున్న నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను నియంత్రించాలని కోరుతూ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇక, విచారణ సందర్భంగా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఉన్న రోడ్డు, గేటు, ఇతర నిర్మాణాల విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే తదుపరి విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది. -
ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్ మనమే చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు అన్ని సంస్థలు సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనువుగా తమనుతాము నిత్యం అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయి. నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో ఎల్లప్పుడూ ముందుండే హైదరాబాద్‌లోని జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ముందడుగు వేసింది. తనిఖీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా సెల్ఫ్ చెక్ కియోస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు టర్మినల్లోకి ప్రవేశించడానికి ముందే తనిఖీలు చేయడం, బ్యాగేజీ చెక్ ఇన్, బోర్డింగ్ పాస్‌ల జారీ వరకు అన్ని సదుపాయాలను ఒకేచోట అందిస్తున్నట్టు జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ ఈడీ ఎస్జీకే కిశోర్ అన్నారు. విమానాశ్రయంలో ఆధునిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయకుండా సెల్ఫ్ చెక్ కియాస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. దీంతో టర్మినల్ వద్ద రద్దీ తగ్గడంతోపాటు ప్రయాణికులు మరింత సులభంగా రాకపోకలు సాగించవచ్చని తెలిపారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. కొత్తగా ఏర్పాటు చేసిన కియాస్క్‌ల వద్ద ప్రయాణికులు వారి బ్యాగ్‌లను వారే చెక్ చేసుకోవచ్చు. అక్కడే బోర్డింగ్ పాస్, బ్యాగ్ ట్యాగ్‌లను తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సేవలు విమానం ప్రారంభమయ్యే గంట ముందు వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. -
Manipur Violence: ఆగని మణిపూర్ అల్లర్లు
ఇంఫాల్: మణిపూర్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివారం చెలరేగిన హింసాకాండలో పదిహేను ఇళ్లు తగలబడ్డాయి. లంగోల్ గేమ్స్ విలేజ్‌లో అల్లరిమూక దాడులకు తెగబడి ఇళ్లను తగులబెట్టారు. దీంతో భద్రతా సిబ్బంది బాష్పవాయువుని ప్రయోగించి పరిస్థితుల్ని అదుపులోనికి తీసుకువచ్చారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చెకోన్ ప్రాంతంలో దుండగులు వాణిజ్య సముదాయాలను తగులబెట్టారు. మరోవైపు రాజకీయంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్డీయేలో ఇన్నాళ్లూ భాగస్వామ్యపక్షంగా ఉన్న కుకీ పీపుల్స్ అలయెన్స్ బైరన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. లూటీ చేసిన ఆయుధాలు వెనక్కి మణిపూర్‌లో అల్లరిమూకలు భారీగా లూటీ చేసిన ఆయుధాల్ని తిరిగి స్వా«దీనం చేసుకునే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు లూటీ అయిన ఆయుధాల్లో 1,195 తిరిగి స్వా«దీనం చేసుకున్నట్టు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. మణిపూర్ లోయ ప్రాంతం జిల్లాల నుంచి 1,057 ఆయుధాలు , కొండ ప్రాంతం జిల్లాల నుంచి 138 ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు ఐజీ ర్యాంకు అధికారి ఒకరు ఆయుధాగారాల లూటీకి సంబంధించి విచారణ జరుపుతున్నారు. అయిదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన హేయమైన ఘటనలో అయిదురుగు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ ప్రాంతం పోలీసు స్టేషన్ ఇన్చార్జ్ సహా అయిదుగురు సిబ్బందిని దీనికి సంబంధించిన వీడియో బయటకి వచి్చన వెంటనే సస్పెండ్ చేసినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ఒక వర్గం ప్రజలు వారి సస్పెన్షన్‌ని వెనక్కి తీసుకోవాలని ప్రతీరోజూ పోలీసు స్టేషన్ ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా వెనక్కి తగ్గలేదని చెప్పారు. జంకుతున్న ఎమ్మెల్యేలు ఈ నెల 21 నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడానికి కుకీ వర్గానికి చెందిన అత్యధిక ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి హాజరుకావడానికి విముఖతతో ఉన్నారు. జాతుల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతూ ఉండడంతో తమకి భద్రత లేదని వారు భయపడుతున్నారు. శాంతి భద్రతలు అదుపులో లేకపోవడం వల్ల తాము అసెంబ్లీకి హాజరు కావడం లేదని కుకి వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎల్.ఎమ్ ఖాటే చెప్పారు. ఎమ్మెల్యేల ఇంఫాల్ ప్రయాణం సురక్షితం కాదని అన్నారు. -
బ్యాంక్ లాకర్.. కాదా బేఫికర్?
బ్యాంకు లాకర్లో విలువైన వాటిని ఉంచేస్తే.. ఎటువంటి భయం లేకుండా ఇంట్లో ప్రశాంతంగా నిద్రించొచ్చని భావించడం పొరపాటే. లాకర్ల విషయంలో బ్యాంకుల బాధ్యత కూడా పరిమితమే. సుప్రీంకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా ఇచి్చన ఆదేశాల నేపథ్యంలో ఆర్బీఐ ఇటీవలే లాకర్లకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. లాకర్లో ఉంచిన వాటిని దోపిడీ లేదా దొంగతనం చేస్తే? లాకర్ కీ కనిపించకుండా పోతే? లాకర్ అద్దె చెల్లించకపోతే? ఇలా ఎన్నో ప్రశ్నలకు జవాబులను లాకర్ హోల్డర్లు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఈ వివరాలతో కూడిన ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది.. లాకర్ అంటే? ఇది ఒక ఖాతా వంటిది. విలువైన వస్తువులు.. ఆభరణాలు, డాక్యుమెంట్లను ఇందులో ఉంచు కోవచ్చు. రెండు కీలు(తాళం చెవులు) ఉంటాయి. అందులో ఒక టి బ్యాంకు దగ్గర, రెండోది లాకర్ దారుని వద్ద ఉంటాయి. ఏదో ఒక కీ సాయంతో లాకర్‌ను తెరవడం సాధ్యం కాదు. రెండు కీలు ఉంటేనే అది సాధ్యపడుతుంది. బ్యాంకు ఉద్యోగి తొలుత తన దగ్గరున్న కీతో లాకర్ రూమ్‌ను తెరుస్తారు. ఆ తర్వాత లాకర్హోల్డర్ తన దగ్గరున్న కీ సాయంతో లాకర్‌ను వినియోగించుకోవడం సాధ్యపడుతుంది. బ్యాంకులు భద్రతాపరంగా అధిక నాణ్యతతో కూడిన లాకర్లను వినియోగిస్తుంటాయి. అందుకే వీటిని సేఫ్ డిపాజిట్ లాకర్లుగా పిలుస్తుంటారు. ఎవరైనా అర్హులే.. మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో లాకర్ సదుపాయాన్ని పొందొచ్చు. ఆ బ్యాంకు శాఖలో ఖాతా లేకపోయినా ఫర్వాలేదు. గతంలో తమ ఖాతాదారులకే బ్యాంకులు ఈ సదుపాయం అందించేవి. కానీ, ఎవరికైనా ఈ సేవలు అందించాలని ఆర్బీఐ 2021 ఆగస్ట్ 18 నాటి ఆదేశాల్లో పేర్కొంది. ఒకవేళ లాకర్ ఖాళీగా లేకుంటే.. దరఖాస్తుదారులతో ఒక వేచి ఉండే జాబితాను నిర్వహిస్తూ.. ఖాళీ అయిన వాటిని వరుస క్రమంలో జాబితాలోని వారికి తప్పనిసరిగా కేటాయించాలి. చట్టవిరుద్ధమైనవి, ప్రమాదకరమైన వాటిని లాకర్లో ఉంచనంటూ ధ్రువీకరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు లాకర్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాలి. బాధ్యతలు, హక్కుల వివరాలు ఇందులో ఉంటాయి. ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటాయి. నూతన లాకర్ ఒప్పందంపై ప్రస్తుత లాకర్ హోల్డర్లు సైతం 2023 జనవరి 1 నాటికి సంతకం చేయాల్సి ఉంటుంది. అద్దె బ్యాంకులు లాకర్ అద్దెను వార్షికంగా ఒక సారి వసూలు చేస్తుంటాయి. అంతేకాదు, లాకర్ కోసం డిపాజిట్ కూడా చేయాలని కోరుతుంటాయి. ఎందుకంటే లాకర్ అద్దె చెల్లించకపోతే.. డిపాజిట్ నుంచి మినహాయించుకునేందుకు అలా చేస్తాయి. మూడేళ్ల కాలానికి లాకర్ అద్దెతోపాటు, లాకర్‌ను తెరవాల్సి వస్తే అయ్యే చార్జీలను కలిపి ఆ మేరకు డిపాజిట్‌గా తీసుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అధికారం కలి్పంచింది. ఇంతకుమించి డిపాజిట్ చేయాలని బ్యాంకులు కోరడానికి వీల్లేదు. అలాగే, లాకర్ కోసం డిపాజిట్ అన్నది తప్పనిసరి కాదు. బ్యాంకులో అప్పటికే కొన్నేళ్లుగా ఖాతా నిర్వహిస్తున్నట్టయితే మీ చరిత్ర ఆధారంగా బ్యాంకులు డిపాజిట్ నుంచి మినహాయింపును ఇవ్వొచ్చు. లాకర్‌ను స్వా«దీనం చేసేస్తే తిరిగి ఈ డిపాజిట్‌ను వెనక్కి పొందొచ్చు. ఇంటికి లేదా కార్యాలయానికి సమీపంలోని బ్యాంకు శాఖలో సౌకర్యం కోసం లాకర్‌ను తెరిచిన తర్వాత.. అనూహ్య కారణాలతో ఆయా బ్యాంకు శాఖను వేరే ప్రాంతానికి మార్చాల్సి వచి్చనా.. లేదా వేరే బ్యాంకుతో విలీనం అయిన సందర్భాల్లో లాకర్ హోల్డర్లకు రెండు నెలల వ్యవధిని బ్యాంకులు ఇస్తాయి. లాకర్‌ను బ్యాంకుతోపాటే మార్చుకోవచ్చు. లేదా మూసేయవచ్చు. అద్దె చెల్లించకపోతే? వరుసగా మూడు సంవత్సరాల పాటు లాకర్ అద్దె చెల్లించకపోతే.. ఆయా లాకర్లను బలవంతంగా తెరిచేందుకు బ్యాంకులకు అధికారం ఉంటుంది. కాకపోతే దీనికంటే ముందు బ్యాంకు తన ఖాతాదారుకు ఇదే విషయమై సమాచారం (నోటీస్) కూడా ఇస్తాయి. ఈ మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సందేశం ఇస్తాయి. నోటీసును స్వీకరించకుండా, మెయిల్, ఎస్ఎంఎస్కు స్పందన రాకపోతే.. అప్పుడు దినపత్రికల్లో పబ్లిక్ నోటీస్ జారీ చేస్తాయి. తగినంత సమయం ఇచ్చిన తర్వాత అప్పటికీ ఎవరి నుంచి స్పందన రాకపోతే.. బ్యాంకు అధికారి, ఇద్దరు సాక్షుల సమక్షంలో లాకర్‌ను తెరుస్తారు. ఈ ప్రక్రియను వీడియో కూడా తీస్తాయి. భవిష్యత్తులో కోర్టుల్లో కేసులు నమోదైతే వీటిని సాక్ష్యాలుగా బ్యాంకు సమరి్పస్తుంది. నగదు సహా లాకర్లో ఉన్న వాటిని సీల్ చేసి భద్రంగా ఉంచుతాయి. నిర్వహణ ఖాతాదారులు లాకర్లను తెరిచి, చూసుకునే సమయంలో వారికంటూ గోప్యత ఉండేలా బ్యాంకులు చూడాలి. అంతేకాదు లాకర్‌ను వినియోగించుకున్న రోజు అందుకు సంబంధించి ఈ మెయిల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లను కూడా బ్యాంకులు ఇక మీదట తప్పకుండా పంపించాలి. తేదీ, సమయం వివరాలు అందులో ఉంటాయి. దీంతో ఒకవేళ తను కాకుండా, మరొకరు లాకర్‌ను యాక్సెస్ చేస్తే ఖాతాదారు అప్రమత్తం అయ్యేందుకే ఈ ఏర్పాటు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తెరిచే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఖాతాదారు ప్రమేయం లేకుండా లాకర్ యాక్సెస్ జరిగి ఉంటే.. అందుకు ఫిర్యాదుల పరిష్కార యంత్రంగా కూడా ఉంటుంది. లాకర్ దారులు వాటిని తెరిచి, మూసేసి వెళ్లిన తర్వాత బ్యాంకు కస్టోడియన్ ఆయా లాకర్లను విధిగా పరీక్షించాలి. ఏదైనా సందర్భంలో లాకర్‌ను తెరిచి, తిరిగి సరిగ్గా క్లోజ్ చేయకుండా వెళ్లి ఉంటే.. బ్యాంకు కస్టోడియన్ వాటిని క్లోజ్ చేయాలి. అదే విషయాన్ని రిజిస్టర్లో నమోదు చేయడంతోపాటు.. ఖాతాదారుకు తెలియజేయాలి. లాకర్దారు మరణిస్తే..? లాకర్లకు సంబంధించి నామినేషన్, లాకర్ హోల్డర్ మరణానికి గురైతే.. లాకర్లలో ఉన్న వాటిని నామినీలకు అందించే విషయమైన ప్రతీ బ్యాంకు తగిన విధానాన్ని కలిగి ఉంటుంది. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను నామినీ సమరి్పంచినట్టయితే లాకర్లలో ఉన్నవాటిని పొందేందుకు బ్యాంకులు అనుమతిస్తాయి. నామినీ నమోదై లేకపోతే.. చట్టబద్ధమైన వారసులకు నిబంధనల మేరకు అందిస్తాయి. క్లెయిమ్‌తోపాటు అవసరమైన అన్ని పత్రాలు అందిన నాటి నుంచి 15 పనిదినాల్లో బ్యాంకులు వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది. బ్రేక్ చేయొచ్చు.. ఖాతాదారు లాకర్ కీ పోయిందని అభ్యర్థన పెట్టుకున్నప్పుడు, లాకర్ జప్తునకు సంబంధించి కోర్టుల ఆదేశాలతో దర్యాప్తు అధికారులు బ్యాంకును సంప్రదించిన సందర్భాల్లోనూ లాకర్‌ను తెరుస్తారు. లాకర్దారు నిబంధనలను పాటించని సందర్భాల్లోనూ ఇదే చోటు చేసుకుం టుంది. లాకర్ల విషయంలో బ్యాంకుల బాధ్యత ప్రకృతి విపత్తుల వల్ల (భూకంపాలు, వరదలు తదితర) లాకర్లలోని వాటికి నష్టం కలిగితే బ్యాంకులు ఎటువంటి పరిహారాన్ని చెల్లించవు. ఖాతాదారుల నిర్లక్ష్యం వల్ల వాటిల్లే నష్టానికి సైతం చెల్లింపులు చేయవు. అగ్ని ప్రమాదం, దొంగతనం, దోపిడీ, భవనం కుప్పకూలిపోవడం, బ్యాంకు ఉద్యోగి మోసం వల్ల లాకర్లలోని వాటికి నష్టం వాటిల్లితే చెల్లింపుల బాధ్యత బ్యాంకులపై ఉంటుంది. ఎందుకంటే చోరీలు, అగ్ని ప్రమాదాల నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకుపై ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మాత్రం తమకు సంబంధం లేదని బ్యాంకులు చెప్పడానికి లేదు. లాకర్‌కు వార్షికంగా వసూలు చేసే అద్దెకు గరిష్టంగా 100 రెట్ల పరిహారాన్ని బ్యాంకులు చెల్లించగలవు. ఉదాహరణకు లాకర్ అద్దె రూ.2,000 ఉందనుకుంటే రూ.2లక్షలు పరిహారంగా లభిస్తుంది. ఎందుకంటే లాకర్లలో ఏవి ఉంచుతున్నారు, తిరిగి ఏవి తీసుకెళుతున్నారు? ఇటువంటి వివరాలను బ్యాంకులు నమోదు చేయవు. ఖాతాదారుల గోప్యతకు భంగం కలగకుండా చూడడంలో భాగంగా ఈ పనికి దూరంగా ఉంటాయి. అటువంటప్పుడు ఫలానావి పోయాయని నిర్ధారించడానికి అవకాశం ఉండదు. కనుక లాకర్ అద్దెకు 100 రెట్లకే పరిహారాన్ని పరిమితం చేసింది ఆర్బీఐ. లాకర్లకు సంబంధించి బ్యాంకులు బీమా కవరేజీని కూడా అందించడం లేదు. లాకర్లలో భద్రత? బ్యాంకు లాకర్లను ఏర్పాటు చేసిన చోట తగినంత భద్రతా చర్యలు తీసుకోవడం బాధ్యతల్లో భాగమే. లాకర్ గది/వాల్ట్‌కు ఒక్కటే ప్రవేశం, వెలుపలి ద్వారం ఉండాలి. వర్షాలు, వరదలు వచి్చనాకానీ లాకర్లు దెబ్బతినకుండా చూడాలి. అగ్ని ప్రమాదాలకు అవకాశం లేని విధంగా.. ఆ రిస్క్‌ను తగ్గించే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. ఈ ప్రమాదాల రిస్‌్కను తగ్గించేందుకు బ్యాంకు ఉద్యోగులు నిపుణులతో కలసి ఇంజనీరింగ్/భద్రతా పరిస్థితులను సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు లాకర్లకు ఎప్పుడూ కూడా తగినంత రక్షణ కూడా ఏర్పాటు చేయాలి. లాకర్ ఆవరణలోకి వెళ్లి, వచ్చే వారిని కవర్ చేసేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. 180 రోజుల సీసీటీవీ కెమెరా రికార్డులను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. తన లాకర్‌ను తన ప్రమేయం లేకుండా ఓపెన్ చేశారని, లాకర్లో ఉంచినవి కనిపించడం లేదని ఖాతాదారు ఫిర్యాదు చేసిన సందర్భంలో దర్యాప్తునకు ఈ సీసీటీవీ కెమెరా రికార్డులు ఆధారంగా పనిచేస్తాయి. బ్యాంకులు ఏర్పాటు చేసే మెకానికల్ లాకర్లు భారత ప్రమా ణాల మండలి (బీఐఎస్) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఎలక్ట్రానిక్‌గా తెరిచే లాకర్లకు పూర్తి సైబర్ భద్రత ఉండాలి. కీ కోల్పోతే..? బ్యాంకు ఇచ్చిన లాకర్ కీని ఎక్కడైన పోగొట్టుకున్నట్టు అయితే వెంటనే ఆ విషయాన్ని బ్యాంకుకు తెలియజేయాలి. కనిపించకుండా పోయిన కీ తిరిగి భవిష్యత్తులో ఎప్పుడైనా లభిస్తే బ్యాంకుకు స్వాధీనం చేస్తానంటూ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు లాకర్‌ను బద్దలు కొట్టడం, తిరిగి కొత్త కీ ఏర్పాటు చేసేందుకు అయ్యే చార్జీలన్నింటినీ ఖాతాదారే భరించాల్సి వస్తుంది. ఈ ప్రక్రియను అంతా ఖాతాదారు సమక్షంలోనే బ్యాంకులు టెక్నీషియన్లతో నిర్వహిస్తాయి. ఎందుకంటే లాకర్లో ఉన్న వాటికి నష్టం వాటిల్లలేదన్న భరోసా ఖాతాదారుకు ఉండాలి కనుక. -
విమాన చార్జీలకు ఇంకాస్త రెక్కలు
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో సెక్యూరిటీ ఫీజు పెరగనుండటంతో విమాన టికెట్ల చార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. దీంతో దేశీయంగా ప్రయాణించే వారు ఇకపై రూ. 150 బదులుగా రూ.160 చెల్లించాల్సి రానుంది. అలాగే అంతర్జాతీయ ప్యాసింజర్లు 3.25 డాలర్లు కాకుండా 4.85 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. టికెట్ చార్జీల్లో భాగంగా సెక్యూరిటీ ఫీజు ఉంటుంది. ప్యాసింజర్లు చెల్లించిన సెక్యూరిటీ ఫీజును విమానయాన సంస్థలు .. ప్రభుత్వానికి కడతాయి. విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్ల నిర్వహణకు ఈ నిధులను వినియోగిస్తారు. గతేడాదే దేశీ ప్రయాణాలపై సెక్యూరిటీ ఫీజును రూ. 130 నుంచి రూ. 150కి, విదేశీ ప్రయాణాల టికెట్లపై 3.25 డాలర్లకు పౌర విమానయాన శాఖ పెంచింది. ఇప్పటికే కరోనా వైరస్ పరిణామాలతో విమాన సర్వీసులు రద్దవుతూ తీవ్ర సంక్షోభంలో ఉన్న ఏవియేషన్ రంగంపై ఇది మరికాస్త భారం కానుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. మూడు నెలల నుంచి ఫ్లయిట్లు నామమాత్రంగా నడుస్తున్నప్పటికీ.. గతేడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ప్రయాణికుల రద్దీ 82.3 శాతం తగ్గింది. జూన్‌లో దేశీయంగా ఆరు దిగ్గజ ఎయిర్‌లైన్స్‌లో అయిదు సంస్థల ఆక్యుపెన్సీ రేటు 50–60% నమోదైంది. అధికారిక గణాంకాల ప్రకారం జూలైలో స్పైస్‌జెట్ ఆక్యుపెన్సీ రేటు 70%, ఇండిగో 60.2%, గోఎయిర్ 50.5%, విస్తార 53.1%, ఎయిర్ఏషియా ఇండియా 56.2 శాతం, ఎయిరిండియా 45.5%గా ఉంది. సంక్షోభ పరిస్థితులతో కుదేలవుతున్న విమానయాన రంగ సంస్థలకు ఊరటనిచ్చే చర్యలపై పౌర విమానయాన శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 2 -
ఆ దేశాలపై అమెరికా ఆంక్షలు
వాషింగ్టన్: గతంలో చెప్పినట్టుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతా నిబంధనలను పాటించడంలో విఫలమైన దేశాల పౌరుల వీసా అనుమతులపై ఆంక్షలు విధించే పత్రంపై సంతకం చేశారు. ఇవి అమెరికా భద్రతకు ప్రమాదకరంగా మారాయని ఆయన వైట్ హౌస్ వెల్లడించింది. ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా, సిరియా, వెనెజులా, యెమన్, సోమాలియా పౌరుల అమెరికా ప్రవేశంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తూ ప్రకటన విడుదల చేసింది. మయన్మార్, ఎరిట్రియా, కిర్గిజిస్తాన్, నైజీరియా వలసదారులకు వీసాల అనుమతిపై నిషేధం విధించింది. సూడాన్, టాంజానియా దేశాలు వీసా లాటరీలో పాల్గొనే అవకాశాన్ని రద్దు చేస్తూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫానియా గ్రెషమ్ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ఆంక్షలేవీ పర్యాటకులకు, వ్యాపారస్తులకు, వలసేతర ప్రయాణికులకు వర్తించవనిన్నారు. అంతర్జాతీయ భద్రతా నిబంధనలను పాటించకుంటే ఎలా ఉంటుందో ఆయా దేశాలకు అర్థమయ్యేందుకే ఈ నిషేధమని యాక్టింగ్ సెక్రటరీ చాడ్ ఎఫ్ వోల్ఫ్ వెల్లడించారు. ‘దేశ భద్రత, ప్రజల రక్షణే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రథమ బాధ్యత అనీ, ఈ ఆంక్షలు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాయని’ వోల్ఫ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
చర్చలకు సీఎం ఆసుపత్రికి రావాలి
న్యూఢిల్లీ/కోల్‌కతా: ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమకు రక్షణ కల్పించాలని వైద్యులు, జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన శనివారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వైద్యులను బుజ్జగించేందుకు సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. తమ సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రే స్వయంగా కోల్‌కతాలోని నీల్‌రతన్ సిర్కర్(ఎన్ఆర్ఎస్) వైద్యకళాశాలకు రావాలని కోరారు. ‘సీఎంతో సమావేశానికి మా ప్రతినిధులను పంపడం లేదు. ఎందుకంటే వారి భద్రత విషయంలో మాకు భయాందోళనలు ఉన్నాయి. కాబట్టి మా వైద్యుడిపై ఓ రోగి బంధువులు దాడి చేసిన ఎన్ఆర్ఎస్ ఆసుపత్రికి సీఎంను ఆహ్వానిస్తున్నాం’ అని ఓ డాక్టర్ తెలిపారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంవైపు నుంచి ప్రయత్నాలు నిజాయితీగా సాగడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులపై దాడులు జరగకుండా భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ బెంగాల్లో 300 మందికిపైగా డాక్టర్లు రాజీనామా చేశారు. వీరికి దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు సంఘీభావం తెలియజేశారు. కేంద్రం ఆందోళన.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ హింస, డాక్టర్ల ధర్నాపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రెండు ఘటనలపై వేర్వేరుగా నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ శనివారం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘మాకు అందిన నివేదికల ప్రకారం 2016లో పశ్చిమబెంగాల్లో 509 హింసాత్మక ఘటనలు నమోదుకాగా, 2018 నాటికి ఆ సంఖ్య 1,035కు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఏకంగా 773 హింసాత్మక ఘటనలు జరిగాయి. అదేసమయంలో ఇలాంటి దుర్ఘటనల్లో చనిపోయినవారి సంఖ్య 2018 నాటికి అది 96కు పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 26 మంది హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు’ అని కేంద్ర హోంశాఖ తెలిపింది. బెంగాల్లో హింసను అరికట్టడానికి ఏమేం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు. ప్రత్యేక చట్టం రూపొందించండి.. ఆసుపత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులు జరగకుండా ప్రత్యేకంగా చట్టాలను రూపొందించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రాష్ట్రాలకు సూచిస్తూ లేఖ రాశారు ఈ లేఖకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) రూపొందించిన ‘వైద్యసేవల సిబ్బంది, వైద్యసంస్థల రక్షణ ముసాయిదా బిల్లు–2017’ను జతచేశారు. భారత వైద్యులు ప్రపంచంలోనే అత్యున్నత నిపుణులుగా గుర్తింపు పొందారనీ, వారు తీవ్రమైన ఒత్తిడిలో, అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు. విధుల్లో చేరండి: మమత పశ్చిమబెంగాల్లో ఆందోళన చేస్తున్న వైద్యుల అన్ని డిమాండ్లను అంగీకరిస్తున్నామని, అవసరమైతే ఇంకా మరిన్ని డిమాండ్లను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం మమత చెప్పారు. ఆందోళన చేస్తున్న వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని కోరారు. ‘వైద్యులు, జూనియర్ డాక్టర్లు గత 5 రోజులుగా ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సేవల చట్టం(ఎస్మా)ను ప్రయోగించలేదు. చర్యలు తీసుకోవడం ద్వారా జూనియర్ డాక్టర్ల కెరీర్‌ను నాశనం చేయాలని మేం భావించడం లేదు. వైద్యులతో శుక్రవారం చర్చించేందుకు నేను 5 గంటలు ఎదురుచూశా. శనివారం నా అధికారిక కార్యక్రమాలు అన్నింటిని రద్దుచేసుకున్నా.ఒకవేళ నాతో చర్చించడం ఇష్టం లేకపోతే గవర్నర్ లేదా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా పోలీస్ కమిషనర్‌తో నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు’ అని స్పష్టం చేశారు. -
సురక్షిత ‘మాధ్యమాల’ కోసం...
సామాజిక మాధ్యమాలనేవి రెండువైపులా పదునున్న కత్తి లాంటివి. ట్వీటర్, ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను అనునిత్యం వందలకోట్లమంది వీక్షిస్తున్నారు. భౌగోళిక సరిహద్దులకు అతీతంగా ప్రపంచంలో ఎక్కడికైనా నిరంతరం స్వేచ్ఛగా ప్రవహించే ఇంటర్నెట్ వాహికగా ఈ మాధ్యమాలన్నీ ఇప్పుడు అరచేతుల్లోని సెల్ఫోన్లలో ఇమిడి పోతున్నాయి. అవి ప్రతి ఒక్కరి స్వరానికీ వేదికవుతున్నాయి. ఆశలు పెంచుకోవడానికి, అవకాశాలు అందుకోవడానికి, ఆలోచన వచ్చిందే తడవుగా దాన్ని లక్షలాదిమందితో పంచుకోవడానికి అవి తోడ్పడుతున్నాయి. వినియోగం వెనకే దుర్వినియోగం మొదలుకావడం ఎక్కడైనా ఉన్నదే. సామా జిక మాధ్యమాల్లో అది మరీ వెర్రితలలు వేస్తోంది. మొన్న మార్చిలో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చి నగరంలో ఒక ఉన్మాది మసీదుల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు సాగిస్తూ 51మందిని పొట్టనబెట్టుకుని ఆ రాక్షసకాండను ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన తీరు దీనంతకూ పరా కాష్ట. స్వేచ్ఛాస్వాతంత్య్రాలను పరిరక్షిస్తూనే... మానవహక్కులకు కాస్తయినా నష్టం కలగనీయకుం డానే ఈ ఆన్లైన్ ఉన్మాదానికి అడ్డుకట్ట వేయడం ఎలాగన్నది చాన్నాళ్లుగా అందరినీ వేధిస్తున్న ప్రశ్న. బుధవారం పారిస్ వేదికగా జరిగిన ప్రపంచ దేశాల నాయకుల, సామాజిక మాధ్యమాల సదస్సు దీనికి సమాధానం వెదకడానికి ప్రయత్నించింది. విద్వేషపూరిత భావాల వ్యాప్తిని సామా జిక మాధ్యమాల్లో సాగనీయకూడదంటూ భారత్‌తోసహా 17 దేశాలు, 8 సామాజిక మాధ్యమాలు ఆ సదస్సులో ప్రతినబూనాయి. అదే సమయంలో భావప్రకటనా స్వేచ్ఛకు కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. తన గడ్డపై ఉన్మాది సాగించిన హత్యాకాండతో కలవరపడిన న్యూజిలాండ్ దేశమే ఈ సదస్సు నిర్వహణకు చొరవచూపింది. అందరినీ సమీకరించింది. అయితే ఇంటర్నెట్ విశ్వ వ్యాపితమైనది. దానిద్వారా వచ్చే సమస్యలు అంతర్జాతీయ స్వభావంతో కూడుకున్నవి. ఎక్కడో ఒకచోట వాటిని అడ్డుకున్నా, మరోచోట మరోరూపంలో అవి వ్యాప్తి చెందుతాయి. నిజానికి ఇప్పుడు జరిగిన సదస్సు వల్ల వెనువెంటనే ఒరిగేదేమీ ఉండదు. ఒక సుదీర్ఘ ప్రయత్నంలో ఇది తొలి అడుగు మాత్రమేనని గుర్తుంచుకోవాలి. పేరేదైనా పెట్టుకోవచ్చుగానీ ఉన్మాదం బహురూపాల్లో విస్తరించి ఉంది. కొన్ని దేశాల్లో అది జాత్యహంకారంగా, మరికొన్నిచోట్ల మతదురహంకారంగా చొచ్చుకొస్తోంది. సకాలంలో ఈ పోకడ లను గమనించి సమాజం ఒక్కటిగా పోరాడకపోతే చూస్తుండగానే అవి విజృంభిస్తాయి. జర్మనీలో శరణార్ధులుగా వచ్చినవారిపై దాడులు, మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలపై దాడులు, సిరి యాలో యజ్దీ తెగ ముస్లింలపై మారణకాండ తదితరాలే ఇందుకు ఉదాహరణ. ఆన్లైన్ ద్వారా ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని వ్యాప్తి చేస్తూ, సమాజాలకు ముప్పు కలిగించే ధోరణులపై సమష్టిగా పోరాడాలన్నది పారిస్ సదస్సు సంకల్పం. ఇదంతా స్వచ్ఛందమేనని, న్యూజిలాండ్ ప్రధాని ఆర్డెర్న్ అంటున్నారు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలను అడ్డుకోవడం ఈ సదస్సు ఉద్దేశం కాదని చెబుతున్నారు. ఒక్కమాటలో ‘మరో క్రైస్ట్‌చర్చి మారణకాండ’ జరగకుండా చూడటమే తమ ధ్యేయమంటున్నారు. మంచిదే. ఏ మాధ్యమమైనా మనుషుల్ని కలిపేదిగా, వారిని మరింత ఉన్నతస్థితికి తీసుకెళ్లేదిగా ఉండాలి తప్ప వారిలో విద్వేషాలు పెంచేలా, ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా, హత్యాకాండను ప్రేరేపిం చేదిగా, దాన్ని ప్రత్యక్షంగా చూపేదిగా మారకూడదు. వినూత్న ఆవిష్కరణలకూ, విలక్షణ ధోరణు లకూ సామాజిక మాధ్యమాలు వేదికలైనప్పుడే భావవ్యక్తీకరణ, సృజనాత్మకత పదునుదేరతాయి. స్వేచ్ఛాస్వాతంత్య్రాలు వర్థిల్లుతాయి. విద్వేషాన్ని గుర్తించి సామాజిక మాధ్యమాల నుంచి దాన్ని తొలగించడం సాంకేతికంగా సాధ్య మేనని సామాజిక మాధ్యమాలు ఇన్నాళ్లూ చెబుతూ వచ్చాయి. ఫేస్బుక్ వంటివి కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వంటి సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి నిత్యం వేలాది పోస్టిం గులు తొలగిస్తున్నామని చెప్పాయి. న్యూజిలాండ్ మారణకాండ ప్రత్యక్షప్రసారమయ్యే వరకూ అందరూ దీన్ని విశ్వసించారు. కానీ అదంతా భ్రమేనని తేలింది. సమర్ధవంతమైన శిక్షణ, సంపూ ర్ణమైన అవగాహన ఉండే సిబ్బంది మాత్రమే దేన్నయినా సకాలంలో గుర్తించి తొలగించగలరు. అయితే ఇందుకోసం గణనీయంగా మానవ వనరులు అవసరమవుతాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ఏటా వేల కోట్ల డాలర్లు లాభాలు ఆర్జించే సంస్థలు తమ సామాజిక బాధ్యతను విస్మరిస్తు న్నాయి. జవాబుదారీతనం ఉంటుందన్న సంగతిని మరుస్తున్నాయి. ప్రభుత్వాలు సైతం ఇన్నాళ్లూ చూసీచూడనట్టున్నాయి. అయితే పారిస్ సంకల్పం మంచిదేగానీ ఆచరణలో దానికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా చిత్తశుద్ధిలేని పాలకులు ఆ వంకన సహేతుకమైన విమర్శలను సైతం నిరోధించే ప్రయత్నం చేస్తారు. అలాంటి పెడధోరణులు తలెత్తకుండా ఏం చేయవచ్చునో మున్ముందు జరిగే సదస్సుల్లో ఆలోచించాల్సి ఉంటుంది. ఉగ్రవాదం, తీవ్రవాదం మాత్రమే కాదు...ఇతరత్రా అనేక రకాల ముసుగుల్లో సాగుతున్న విద్వేషం కూడా సమాజాలకు ముప్పు కలిగిస్తోంది. తమకు నచ్చని వ్యక్తులపై, గ్రూపులపై వదంతులు వ్యాప్తి చేయడం, దాడులకు పురిగొల్పడం మనదేశంలో ఇటీవలి కాలంలో పెచ్చరిల్లుతోంది. కేవలం వదంతుల కారణంగా మూకదాడులకు పలువురు బలయ్యారు. ఇక ఆన్లైన్లో మహిళలు లైంగిక వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొనడం నిత్యకృత్యం. సామాజిక మాధ్యమాలు సురక్షితంగా మారాలంటే వీటన్నిటినీ పరిహరించడమెలాగో ఆలోచించాలి. ఇన్నేళ్ల కైనా సామాజిక మాధ్యమాల దుష్ఫలితాలపై ఉన్నత స్థాయిలో చర్చ మొదలైంది గనుక కేవలం ఉగ్ర వాదం, తీవ్రవాదంవంటివేకాక, ఇతరేతర అంశాలు సైతం ఇందులో చేరాలి. ‘క్రైస్ట్‌చర్చి పిలుపు’ మరింత అర్ధవంతంగా మారాలంటే సామాజిక మాధ్యమాలకు జవాబుదారీతనం అలవర్చాలి. -
నేతల భవిత భద్రం!
మహబూబ్‌నగర్ క్రైం: పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తమ తీర్పు తెలపగా.. ఈవీఎంలలో నేతల భవిత భద్రంగా ఉంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 12మంది అభ్యర్థులు బరిలో ఉండటం తెలిసిన విషయమే. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలన్నింటినీ ఇప్పుడు జిల్లా కేంద్రంలోని జేపీఎన్సీఈ కళాశాల భవనాల్లో ఉంచారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఈవీంలు, వీవీప్యాట్లు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఇక అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లో దాగి ఉంది. మే 23న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. అంటే సరిగ్గా 38రోజుల సమయం ఉంది. ఇన్ని రోజులు అభ్యర్థులు ఓపిక పట్టక తస్పదు. ఇప్పుడు అందరి చూపు జేపీఎన్‌ఈఎస్ కళాశాల వైపే ఉంది. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు మహబూబ్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చిన ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. భవనంలోని కింది అంతస్తులో మూడు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూంలు, పైన అంతస్తులో నాలుగు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక స్ట్రాంగ్ రూం, ఒక ఓట్ల లెక్కింపు గదిని ఏర్పాటు చేశారు. అధికారులు, అభ్యర్థులు కూర్చునేందుకు, అలాగే మీడియా పాయింట్‌కు వేర్వేరు గదులను కేటాయించారు. నిఘా నేత్రాలతో పర్యవేక్షణ భవనం లోపల ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలో ఇతర విలువైన ఎన్నికల సామాగ్రి ఉన్నందున నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండు అంతస్తుల్లోని స్ట్రాంగ్ రూంలు, గదులు తలుపులకు, హాళ్లలో, విధులు నిర్వహించే పోలీసుల గదుల వద్ద, భవనం, బయట కెమెరాలు బిగించారు. ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన గదులు, హాల్లో కనీసం కలిపి దాదాపు 30వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భవనం బయట, లోపల అన్ని గదులు సీసీ కెమెరాల నిఘా నేత్రంలో నిక్షిప్తమవుతున్నాయి. బందోబస్తు నిర్వహించే పోలీసులు అప్రమత్తంగా ఉండేందుకు ఇవి దోహదపడటమే కాకుండా ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పని చేస్తాయి. భవనం లోపల, పైన ఆరుబయట ప్రాంగణం మొత్తంలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. పారామిలటరీ పోలీసుల ఆధీనంలో.. జేపీఎన్‌ఈఎస్ భవనాన్ని సీఆర్పీఎఫ్(సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్), పారామిలటరీ పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 40మంది సీఆర్పీఎఫ్, 20మంది జిల్లా పోలీసులు నిత్యం ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. భవనం లోపల పారామిలటరీ పోలీసులే ఉంటారు. సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అనుమతి లేనిదే ఎవరినీ లోనికి పంపరు. జిల్లా లోకల్ పోలీసులను కూడా లోనికి అనుమతించారు. స్ట్రాంగ్ రూంల వద్ద బందోబస్తు నిర్వహించే సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసి డ్యూటీ వేస్తారు. భవనం లోనికి వెళ్లే ప్రధాన ద్వారంతో పాటు పక్కన, వెనుక ఉన్న గేట్ల వద్ద బందోబస్తు పెట్టారు. ఉన్నతాధికారుల అనుమతితో పని నిమిత్తమై వచ్చే ఆర్వో, ఏఆర్వోలను అప్పుడప్పుడూ అధికారులకు లోపలికి వెళ్లడానికి మాత్రం అవకాశం కల్పిస్తారు. అలాగే భవనం చుట్టూ పోలీసులు పికెటింగ్‌లు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. భవనం వద్ద బందోబస్తుపై లోకల్ పోలీసులకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచనలు చేశారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ ప్రాంగణంలోనికి రానివ్వద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. -
ఫేస్బుక్లో బయటపడ్డ మరో భద్రతాలోపం
శాన్ ఫ్రాన్సిస్కో: భద్రతా లోపం కారణంగా కొన్ని కోట్ల ఫేస్బుక్ ఖాతాల పాస్వర్డ్లు ఎలాంటి ఎన్క్రిప్షన్ లేకుండా సాధారణ అక్షరాలుగానే సంస్థ అంతర్గత సర్వర్‌ల్లో స్టోర్ అయ్యాయని ఫేస్బుక్ గురువారం ఒప్పుకుంది. అలాంటి ఖాతాల సంఖ్య 60 కోట్లని విశ్వసనీయ సమాచారం. 20 వేల మంది తమ సంస్థ ఉద్యోగులకు ఆ పాస్వర్డ్లు కనిపించేవనీ, బయటి వారికి కాదని తెలిపింది. ఉద్యోగులు ఆ ఖాతాల్లోకి అనధికారికంగా లాగిన్ అయినట్లు కానీ, వాటిని దుర్వినియోగం చేసినట్లు కానీ తమకేమీ ఆధారాలు లభించలేదని సంస్థ ఇంజినీరింగ్, సెక్యూరిటీ, ప్రైవసీ విభాగాల ఉపాధ్యక్షుడు పెడ్రో కనహువాటి చెప్పారు. ఈ ఏడాది మొదట్లో సాధారణ భద్రతా తనిఖీలు చేస్తుండగా ఈ విషయం బయటపడిందన్నారు. ఇలా ఏయే ఫేస్బుక్ ఖాతాల పాస్వర్డ్లు బయటకు కనిపించాయో ఆయా ఖాతాదారులకు దీనిపై త్వరలో ఓ నోటిఫికేషన్ కూడా పంపే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. -
డిజిటల్ అక్షరాస్యతపై ఫేస్బుక్ శిక్షణ
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యవహారాల్లో భద్రతపై చిట్కాలు నేర్పించేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ ‘డిజిటల్ లిటరసీ లైబ్రరీ’ పేరిట ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలుగు, బెంగాలీ, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో శిక్షణ ఉంటుందని వెల్లడించింది. ఇప్పటికే వేర్వేరు మార్గాల ద్వారా ఫేస్బుక్ డిజిటల్ అక్షరాస్యతలో 2 లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 3 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలసి పనిచేస్తామని ఫేస్బుక్ చెప్పింది. ప్రాథమికంగా ఈ శిక్షణలో మహిళలు, యువతకు ప్రాధాన్యమిస్తామని తెలిపింది. పిల్లల భద్రతపై ఐఐటీ ఢిల్లీలో రెండ్రోజుల హ్యాకథాన్‌ను నిర్వహిస్తోంది. పిల్లల అక్రమ రవాణా కట్టడికి ఈ సమావేశంలో కనుగొనే పరిష్కార మార్గాల్ని తమ భాగాస్వామ్య ఎన్జీవోలను ఇస్తామంది. తెలిపింది. కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఫేస్బుక్ ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. -
పుష్కరాలకు భారీ బందోబస్తు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: పుష్కరాల్లో బందోబస్తు చర్యలు పుష్కలం. పోలీసులు పటిష్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ నెల 12(శుక్రవారం) నుంచి జరిగే కృష్ణా పుష్కరాలకు తరలి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో దాదాపు 13,474 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ఘాట్ల వద్ద 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మేజర్, మైనర్, లోకల్ ఘాట్లు 57 వరకు ఉన్నాయి. వీటి వద్ద భద్రత కోసం 6,754 మంది పోలీసులను కేటాయించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని బాగా రద్దీ ఉండే అవకాశమున్నా బీచుపల్లి ఘాట్‌కు శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్, హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్‌ను ఇన్చార్జిలుగా నియమించినట్లు తెలిపారు. అలంపూర్ పుష్కర ఘాట్‌కు ఐజీ కె.శ్రీనివాస్‌రెడ్డి, ఈగలపెంట వద్దనున్న ఘాట్‌కు సెక్యూరిటీ వింగ్ జాయింట్ సీపీ మహేందర్ కుమార్ రాథోడ్, కృష్ణా గ్రామం వద్దనున్న ఘాట్‌కు సీఐడీ ఎస్పీ ఎం.శ్రీనివాసులుకు భద్రతా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. నల్లగొండ జిల్లాలోని 28 పుష్కరఘాట్ల భద్రత కోసం 6,720 మంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. జిల్లాలో రద్దీగా ఉండే వాడపల్లి ఘాట్‌కు నార్త్‌జోన్ ఐజీ వై నాగిరెడ్డి, సాగర్ ఘాట్‌కు డీఐజీ ఎంకే సింగ్, మఠంపల్లి ఘాట్‌కు గ్రేహౌండ్స్ ఎస్పీ తరుణ్జోషిని కేటాయించినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు పుష్కర భక్తులకు ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. ట్రాఫిక్‌ను అంచనా వేసి అదుపు చేసేందుకు రెండు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. నల్లగొండ జిల్లాలో 55, మహబూబ్‌నగర్ జిల్లాలో 33 ట్రాఫిక్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. రహదారి వెంబడి ఎక్కడికక్కడ ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులను నెలకొల్పిన్లు తెలిపారు. మహిళలపై వేధింపులు జరగకుండా చూసేందుకు 27 ‘షీ’ టీమ్‌లను, సంఘవిద్రోహ చర్యలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 80 చెక్ టీమ్‌లను నియమించామని పేర్కొన్నారు. అన్ని పుష్కరఘాట్ల వద్ద దాదాపు 555 సీసీ కెమెరాలతో ఎల్లవేళలా గస్తీ నిర్వహిస్తామని వివరించారు. రెండు జిల్లాల ఎస్పీలు భక్తుల సౌకర్యార్థం కోసం మొబైల్ యాప్‌లను ఏర్పాటు చేశారన్నారు. -
ప్రాణాలు పోకముందే స్పందించండి
గిద్దలూరులో టెన్షన్ 1990లో ఎన్నికల ప్రచారానికి వెళుతున్న జీపు రాచర్ల మండలంలోని రామాపురం రైల్వే గేటు వద్ద గేటు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో జీపులో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆతర్వాత కొన్నాళ్లకు గేటు ఏర్పాటు చేశారు. రాచర్ల మండలంలోని గుడిమెట్ట వద్ద రైల్వే క్రాసింగ్ రోడ్డు ఉంది. కానీ ఇక్కడ గేట్ లేదు. గేట్‌మ్యాన్ కూడా లేడు. రద్దీగా ఉండే ఈ రహదారిలో నిత్యం వాహనాలతో పాటు ప్రజలు తిరుగుతుంటారు. గేటు లేని కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ►అలాగే అచ్చంపల్లె, ఒద్దులవాగుపల్లె గ్రామాల మధ్య కూడా రైల్వే క్రాసింగ్ లేన్‌కు భద్రతా చర్యలు తీసుకోలేదు. గేటు లేని కారణంగా ప్రజలు ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటారు. ఏ సమయంలో రైలు బండ్లు వస్తాయో ఎవరికీ తెలియదు. పట్టాలపై వాహనాలు ఆగిపోతే పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించక తప్పదు. ►గిద్దలూరు మండలంలోని పెద్దచెరువు గ్రామానికి వెళ్లే రోడ్డులో రైల్వే ట్రాక్‌పై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. గేటు లేకపోవడమే దీనికి కారణం. కానీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. -గిద్దలూరు దర్శి నియోజకవర్గం ఘోరం ►కురిచేడు మండలంలో సుమారు 13 కిలోమీటర్ల మేర గుంటూరు-డోన్ రైల్వే మార్గం ఉంది. అయితే మండల పరిధిలోని వెంగాయపాలెం వద్ద రైల్వే క్రాసింగ్ గేటు లేదు.. కాపలాగానూ ఎవరూ ఉండరు. గేటు దాటుకుంటూ పశువులతో పాటు వ్యవసాయ కూలీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వ్యవసాయ సీజన్లో అయితే రాత్రి వేళ కూడా గేటు క్రాస్ చేయాల్సిందే. ►మండల కేంద్రం కురిచేడు వద్ద నాగార్జున సాగర్ కాలువ కట్టపై ఓ రైల్వే బ్రిడ్జి ఉంది. ఇక్కడ కూడా గేటు లేదు. ఈ మార్గం నుంచి కాటంవారిపల్లె, పేరంబొట్లవారిపాలెం గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. పొలాల ప్రాంతం కావడంతో పశువులు అరకలతో, ఎడ్లబండ్లతో పట్టాలు దాటుతుంటాయి. రైతులు, రైతు కూలీలు, సాగర్ కాలువ పరిశీలనకు వెళ్లే అధికారులు కూడా ప్రమాదభరితంగా ఆ మార్గంలో తిరుగుతుంటారు. ►కాటంవారిపల్లెకు కూతవేటు దూరంలో మరో రైల్వే క్రాసింగ్ ఉంది. దీని ద్వారా కేవలం పంటపొలాలకు వెళ్లే ట్రాక్టర్లు, పశువులు, రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే పొట్లపాడు గ్రామంలో ఉన్న రైల్వే క్రాసింగ్ నుంచి పొట్లపాడు గ్రామస్తులు, మొండెద్దుల వారిపాలెం గ్రామస్తులు కూడా వెళుతుంటారు. ►దొనకొండ మండలంలోని గుంటూరు- గుంతకల్ రైల్వే లైన్లో ఐదు రైల్వే క్రాసింగ్ గేట్లున్నాయి. రెండు చోట్లు గేట్ మ్యాన్లుండగా... రైల్వేశాఖ మరో రెండు గేట్లను మూసివేసింది. అయితే రాజమక్కపల్లి గేటు మాత్రం ప్రమాద భరితంగా ఉంది. ఇక్కడ కాపలాగా ఎవరూ లేరు. భూమనపల్లి, మంగినపూడి, మల్లమ్మ పేట, కొచ్చెర్ల కోట, ఇండ్లచెరువు, దొనకొండ, వెంకటాపురం తదితర గ్రామాల ప్రజలు నిత్యం ఈ గేటు నుంచి పనులపై వెళతారు. ►నియోజకవర్గ పరిధిలోని ఈ క్రాసింగులన్నీ రైల్వేలేన్ ఏర్పాటైనప్పటి నుంచి ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు గేటు నిర్మించలేదు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ చేసే సమయంలో కూడా క్రాసింగ్ గేట్ల గురించి మరచి పోయారు. ఫలితంగా ఇప్పటికే జరిగిన ఎన్నో ప్రమాదాల్లో వందలాది పశువులు చనిపోయాయి. ఎంతమంది మనుషులు ప్రాణాలు విడిచారు. కానీ రైల్వే అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం విచారకరం. - తాళ్లూరు మార్కాపురంలో మరణాలు ►మార్కాపురం- తర్లుపాడు, మార్కాపురం -గజ్జలకొండ మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్‌లతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ మార్గంలో కాపలాలేని మూడు రైల్వేగేట్లున్నాయి. మార్కాపురం మండలంలోని నాయుడుపల్లె, భూపతిపల్లె, తర్లుపాడు మండలంలోని సూరేపల్లి దగ్గర గేట్మెన్ లేరు.. గేట్లూ లేవు. నాయుడుపల్లె వద్ద ఈ ఏడాది ఏప్రిల్‌లో గూడ్స్ రైలు ఆటోను ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గత ఏడాది తర్లుపాడు మండలం సూరేపల్లి దగ్గర రైలు ఢీకొనటంతో 3 గేదెలు మృతి చెందాయి. గత ఏడాది భూపతిపల్లె రైల్వే గేటు వద్ద రైలు.. ఆటోను ఢీకొన్న సంఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. సంపాదనే ధ్యేయంగా ఉండే రైల్వే శాఖకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు-గుంతకల్ మార్గంలో ప్రస్తుతం గూడ్స్ రైళ్ల రాకపోకలు ఎక్కువయ్యాయి. వీటికి తోడు గుంటూరు-కాచిగూడ, మచిలీపట్నం, ప్రశాంతి, తెనాలి ప్యాసింజర్ రైళ్లు తిరుగుతుంటాయి. ఏ సమయంలో ఏ బండి వస్తుందో వాహనదారులకు అర్థం కావడంలేదు. - మార్కాపురం