
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యవహారాల్లో భద్రతపై చిట్కాలు నేర్పించేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్‌బుక్ ‘డిజిటల్ లిటరసీ లైబ్రరీ’ పేరిట ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలుగు, బెంగాలీ, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో శిక్షణ ఉంటుందని వెల్లడించింది. ఇప్పటికే వేర్వేరు మార్గాల ద్వారా ఫేస్‌బుక్ డిజిటల్ అక్షరాస్యతలో 2 లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 3 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలసి పనిచేస్తామని ఫేస్‌బుక్ చెప్పింది. ప్రాథమికంగా ఈ శిక్షణలో మహిళలు, యువతకు ప్రాధాన్యమిస్తామని తెలిపింది. పిల్లల భద్రతపై ఐఐటీ ఢిల్లీలో రెండ్రోజుల హ్యాకథాన్‌ను నిర్వహిస్తోంది. పిల్లల అక్రమ రవాణా కట్టడికి ఈ సమావేశంలో కనుగొనే పరిష్కార మార్గాల్ని తమ భాగాస్వామ్య ఎన్జీవోలను ఇస్తామంది. తెలిపింది. కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఫేస్‌బుక్ ప్రతినిధులతో సమావేశమై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment