టెలికమ్యునికేషన్ సేవలందిస్తున్న వొడాఫోన్-ఐడియా(వీఐ) ప్రతిష్టాత్మక ‘పీసీఐ డీఎస్‌ఎస్ 4.0’ సర్టిఫికేషన్ పొందినట్లు తెలిపింది. దాంతో ఈ ఘనత సాధించిన తొలి భారత కంపెనీగా గుర్తింపు పొందింది. కస్టమర్ల డిజిటల్ లావాదేవీలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నందుకు ఈ గుర్తింపు లభించిందని కంపెనీ పేర్కొంది.
సిమ్‌కార్డు ఆధారంగానే డిజిటల్ లావాదేవీలు చేస్తూంటారు. మోసపూరిత చెల్లింపులను నివారించి, కస్టమర్ డేటాను భద్రంగా ఉంచడంలో పకడ్బందీ చర్యలు పాటిస్తున్నట్లు వీఐ తెలిపింది. కంపెనీ రిటైల్‌స్టోర్స్, పేమెంట్ ఛానల్స్‌కు సంబంధించి ఈ చర్యలు చేపట్టినందుకు పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్ వెర్షన్ 4.0 (పీసీఐ డీఎస్‌ఎస్ 4.0) సర్టిఫికేషన్ పొందినట్లు వెల్లడించింది. దాంతో భారత్‌లో ఈ ప్రతిష్టాత్మక సర్టిఫికేషన్ పొందిన తొలి టెలికం ఆపరేటరుగా వొడాఫోన్-ఐడియా నిలిచింది.
ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ..‘అత్యుత్తమ గ్లోబల్ సెక్యూరిటీ ప్రమాణాలకు సంస్థ కట్టుబడి ఉంది. కస్టమర్ల డేటా భద్రతకు కంపెనీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పీసీఐ డీఎస్‌ఎస్ 4.0 సర్టిఫికేషన్ పొందడమనేది పకడ్బందీ భద్రతా చర్యలను పాటించడంలో మాకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. భారత్‌లో ఈ సర్టిఫికేషన్ పొందిన తొలి టెలికం సంస్థగా నిలవడం సంతోషకరం. పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు, అధునాతన సెక్యూరిటీ టెక్నాలజీలపై పెట్టుబడి పెట్టేందుకు సంస్థ సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.
ఇదీ చదవండి: ‘పది కోట్లమంది ప్రయోజనాలు కాపాడుతాం’
పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ(పీసీఐ) సెక్యూరిటీ స్టాండర్డ్స్ కౌన్సిల్‌ను ప్రారంభించింది. డేటా ఉల్లంఘనలు, క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలకు సంబంధించిన మోసాలు గుర్తించడం, వాటికి అందించే భద్రత చర్యలు, అందుకోసం సంస్థలు పాటించే అత్యంత కఠినతరమైన, అప్-టు-డేట్ సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను ఇది సూచిస్తుంది. భారత్‌లోని బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు తప్పనిసరిగా పీసీఐ డీఎస్‌ఎస్ 4.0 సర్టిఫికేషన్ పొందాలని ఇప్పటికే ఆర్‌బీఐ మార్గదర్శకాల్లో నిర్దేశించింది.
Comments
Please login to add a commentAdd a comment