జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన కూలీలకు బకాయి పడ్డ రూ. 80 కోట్ల బిల్లులను తక్షణమే చెల్లించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని జిల్లా సీపీఎం కార్యదర్శి వి.రాంభూపాల్ హెచ్చరించారు.
అనంతపురం అర్బన్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన కూలీలకు బకాయి పడ్డ రూ. 80 కోట్ల బిల్లులను తక్షణమే చెల్లించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని జిల్లా సీపీఎం కార్యదర్శి వి.రాంభూపాల్ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక గణేనాయక్ భవన్‌లో కార్యదర్శి వర్గ సభ్యుడు ఓ.నల్లప్పతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలకు మళ్లించుకుంటోందని విమర్శించారు.బిల్లులు సకాలంలో విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు.