
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లపై ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జరీఫ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ ఢిల్లీలోని ఆ దేశ రాయబారి అలీ చెగేనికి భారత ప్రభుత్వం మంగళవారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ అల్లర్లపై జావెద్ జరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవని కేంద్రం పేర్కొంది. ఇదే సమయంలో తమ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఇరాన్‌కు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ రాయబారి చెగేనికి తేల్చిచెప్పింది. చదవండి: ఈశాన్య ఢిల్లీ అల్లర్లు.. మృతులు 45
ఢిల్లీ అల్లర్లపై జరీఫ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. 'ఇలాంటి తెలివిలేని హింస జరగకుండా భారత అధికారులు జాగ్రత్తపడాలని అన్నారు. మరో అడుగు ముందుకేసి భారత ముస్లింలపై జరిగిన వ్యవస్థీకృత హింసను ఇరాన్ ఖండిస్తోంది' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ.. ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు ఇచ్చింది. అయితే.. సున్నిత అంశంపై బాధ్యతా రహితమైన ప్రకటనలు చేయకండని అంతర్జాతీయ నాయకులు, సంస్థలను భారత విదేశాంగ శాఖ గతంలో విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ అల్లర్లపై నకిలీ ఫొటోలు వైరల్!