కౌంటింగ్‌ సమయంలో అల్లర్లకు కుట్ర! | TDP is likely to create riots during counting | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ సమయంలో టీడీపీ అల్లర్లు సృష్టించే అవకాశం

Published Mon, May 20 2024 4:22 AM | Last Updated on Mon, May 20 2024 7:28 AM

TDP is likely to create riots during counting

కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలి 

ఎన్నికల సంఘాన్ని కోరిన వైఎస్సార్‌సీపీ బృందం

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్‌సీపీ బృందం కోరింది. ఈ మేరకు ఆదివారం వెలగపూడి సచివాలయం అడిషనల్‌ సీఈవో కోటేశ్వరరావును కలిసి ఫిర్యాదు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ తమకు ఓటు వేయలేదనే ఉక్రోషంతో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా హింసను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ అభ్యర్థులే రోడ్లపైకొచ్చి దాడులకు తెగ­బ­డుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని చెప్పారు. 

కౌంటింగ్‌ సమయంలోనూ టీడీపీ అల్ల­ర్లను సృష్టించే అవకాశముందని, శాంతిభద్రతల సమస్య తలెత్త­కుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ సమయంలో పాటించాల్సిన నిబంధనలను 175 నియోజకవర్గాల్లోనూ తూచా తప్పకుండా పాటించేలా చొరవ తీసుకోవాలని కోరా­మన్నారు. పోలింగ్‌ రోజు దెందులూరు నియో­జకవర్గం కొప్పులవారి­పాలెంలో జరిగిన ఓ దాడి ఘటనలో టీడీపీకి చెందిన రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసు­కోగా.. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ పోలీసుల­పైన దౌర్జన్యం చేశారని, తక్ష­ణమే ఆయనను అరెస్ట్‌ చేసి పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చె­న్నాయుడు పోటీ చేస్తున్న టెక్కలి నియోజకవర్గంలోనూ ఆ పార్టీ అరాచకాలకు ఓ నిండు ప్రాణం బలైందన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన తోట మల్లేష్‌ ఇంటిపై దాడికి తెగబడి.. అతని చావుకు కారణమ­య్యారని చెప్పారు. దాడులను ప్రోత్స­హించిన అచ్చెన్నాయుడిపైనా కేసు నమోదు చేయాలని కోరినట్టు తెలిపారు. గురజాల, మాచర్ల, నరస­రావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రి సహా రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నింటికీ మూలకారణం టీడీపీ నాయకులని మల్లాది విష్ణు ఆరోపించారు. కానీ సిట్‌ను తప్పు­దోవ పట్టించేలా స్థానిక వైఎస్సార్‌­సీపీ అభ్యర్థులపైనే ఫిర్యాదులు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని, ఈ నేప­­థ్య­ంలో నిష్పక్ష­పాతంగా దర్యాప్తు చేయా­లని సిట్‌ అధికారులను కోరినట్టు వివరించారు.



ఉయ్యూరు లోకేశ్‌ వంటి ఉన్మాదులనుచంద్రబాబు రెచ్చగొడుతున్నారు..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనను ఉన్మాది ఆలోచనలతో అడ్డుకునే కుట్ర చేసినందుకే ఉయ్యూరు లోకేశ్‌ను గన్నవరం విమా­నాశ్రయంలో పోలీ­సులు అరెస్ట్‌ చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు నీచ మనస్తత్వంతో లోకేశ్‌ వంటి వారిని రెచ్చగొడు­తున్నారని ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.

 అత్యంత భద్రత మధ్య ఉండే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకో­వాలనే లోకేశ్‌ కుట్ర వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ సాను­భూతి­పరుడైన లోకేశ్‌ డాక్టర్‌ అయినప్పటికీ ఉన్మాద మనస్తత్వంతో టీవీ డిబేట్లలో వైఎస్సార్‌సీపీపై విషం చిమ్ముతుంటారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయపాలేనికి చెందిన ఉయ్యూరు లోకేశ్‌ 38 ఏళ్లుగా అమెరికాలో వైద్యుడిగా పని చేస్తు­న్నారని, ఆయనకు అమెరికా పౌరసత్వం కూడా ఉందని పేర్కొన్నారు.

 శుక్రవారం హైదరా­బాద్‌ నుంచి స్వగ్రామానికి వచ్చారని, ఆ తర్వాత నేరుగా గన్నవరం విమా­నాశ్రయానికి చేరుకుని సీఎం జగన్‌ విదేశీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ సాను­భూతిç­³రులకు మెసేజ్‌లు పెట్టినట్టు పోలీసు­లకు ఆధారాలు లభించాయని వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement