
ఐబీ కానిస్టేబుల్ అంకిత్ శర్మ(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో హత్యకు గురైన ఇంటెలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ అంకిత్ శర్మ మృతదేహంపై 51 గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో తేలింది. ఆయన పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌కు సంబంధించిన మరికొన్ని విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. కత్తులు రాడ్లతో దాడి చేయటంతో ఊపిరితిత్తులు, మెదడుకు బలమైన గాయాలై ఆయన మరణించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. శరీరం వెనుక, తొడలు, కాళ్లపై పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు గుర్తించారు. అతడి శరీరంపై ఉన్న 33 గాయాలు పదునైన ఆయుధాలు, రాడ్లతో చేయబడ్డవేనని, ఆ గాయాల కారణంగానే అంకిత్ శర్మ మరణించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ( అంకిత్ శర్మ హత్య: తాహిర్‌పై ఆప్ వేటు )
కాగా, గత నెలలో ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో గుర్తు తెలియని దుండగులు అంకిత్‌ను దారుణంగా హతమార్చి.. మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లలో దాదాపు 50మంది మృత్యువాతపడగా.. వందల మంది గాయాలపాలయ్యారు. (ఢిల్లీ అల్లర్లు: డ్రైనేజీలో ఆఫీసర్ మృతదేహం)
చదవండి : సీఏఏ దారుణం: తలలోకి డ్రిల్లింగ్ మెషీన్ దింపేశారు!
Comments
Please login to add a commentAdd a comment