ఆధారాలు లేనందునే ఆయన్ను ప్రశ్నించలేదని ఈ అల్లర్లపై దర్యాప్తు చేపట్టిన జ్యుడీషియల్ కమిషన్‌కు చైర్మన్ అయిన రిటైర్డ్ జస్టిస్ నానావతి స్పష్టం చేశారు.
అహ్మదాబాద్: గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లలో నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రమేయాన్ని నిర్ధారించే ఆధారాలు లేనందునే ఆయన్ను ప్రశ్నించలేదని ఈ అల్లర్లపై దర్యాప్తు చేపట్టిన జ్యుడీషియల్ కమిషన్‌కు చైర్మన్ అయిన రిటైర్డ్ జస్టిస్ నానావతి స్పష్టం చేశారు. ఈ విషయంలో మోదీపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేనందువల్లే ఆయనకు సమన్లు జారీ చేయడం సరికాదని భావించామన్నారు. బుధవారం ఆయన అహ్మదాబాద్‌లో ఓ వార్తాసంస్థతో ఈ మేరకు మాట్లాడారు. నానావతి కమిషన్ మంగళవారం తమ తుది నివేదికను గుజరాత్ ప్రభుత్వానికి సమర్పించింది.