సాక్షి, తిరుపతి: చంద్రగిరిలో అల్లర్లపై స్పందించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. పులివర్తి నానిని తాను రాజకీయ ప్రత్యర్థిగానే చూశానని..తనపై ఎన్ని విమర్శలు చేసినా తిరిగి విమర్శ చేయలేదని తెలిపారు. తన బావ మరిదిపై పులివర్తి నాని చేయి చేసుకున్నాడని, నామినేషన్ రోజు తన కారుపై దాడి చేశారని మండిపడ్డారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా నానిపై ఒక్క కేసు పెట్టలేదని పేర్కొన్నారు.
శ్రీ పద్మావతి వర్సిటీ వద్ద ఘర్షణలో నానికి గాయాలు కాలేదని, అక్కడి నుంచి యాక్టివ్‌గా నాని నడుచుకుంటూ వెళ్లిపోయారని అన్నారు. రెండు గంటల తర్వాత వీల్‌చైర్‌లో ఉన్నాడని, ఇదంతా డ్రామా అని తెలిపారు. పులివర్తి నాని డ్రామాల వల్ల నియోజకవర్గంలో శాంతి భద్రతలు దెయ్యతిన్నాయని విమర్శించారు.
‘ఎవరినో విమర్శలు చేయాలని, తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక అవాస్తవం ప్రచారం చేస్తుంటే...వాస్తవాలు మీ దృష్టికి తీసుకువస్తున్నా. సామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న వాడిని, న్యాయ శాస్త్రంలో పట్టా పుచుకున్నవాడిపి. కర్మ సిద్ధాంతం నమ్ముకున్న వాడిని. గత అయిదేళ్లుగా నాపై విమర్శలు చేస్తున్నా, ఏ రోజు చిన్న విమర్శ చేయలేదుజ
చంద్రగిరిలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు. నారా భువనేశ్వరి పర్యటన చాలా ప్రశాంతంగా జరిగింది. పులివర్తి నాని , అతని భార్య అసభ్య పదజాలంతో నన్ను రోజు తిడుతూ ఉన్నారు. పోలింగ్ రోజు మోహిత్ కారు దగ్ధం చేశారు. సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారు. సుధాకర్ అనే వ్యక్తి కాలికి బుల్లెట్ దిగింది, చెన్నై అపోలో చికిత్స పొందుతూ ఉన్నాడు. కాలికి తీవ్రగాయం అయ్యింది. మాపై విష ప్రచారం చేస్తున్నారు,
పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చిత్తూరు మహానటి ప్రదర్శన చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో పేషెంట్‌ను చూసేందుకు వచ్చిన బంధువుపై దాడి చేశారు. నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలి. ’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment