అధికారులు, వ్యాపారులను బెదిరిస్తున్నారు
చంద్రగిరిలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు
మూమూళ్లివ్వలేదని ఆర్యవైశ్య సంఘం నేత రైస్ మిల్లు మూయించేశారు
రూ.250 కోట్ల దేవదాయ శాఖ భూమిని ఆక్రమించారు
రియల్ ఎస్టేట్ వ్యాపారులను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు
చంద్రగిరి ఎమ్మెల్యే నానిపై చెవిరెడ్డి ఫైర్
తిరుపతి రూరల్ : చంద్రబాబు, లోకేశ్‌కి దగ్గరి వ్యక్తి అయిన కిలారు రాజేష్ పేరుతో తిరుపతి జిల్లాలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దందాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. నాని చర్యలతో అధికారులు, వ్యాపారులంతా భయాందోళనలకు గురవుతున్నారని, ఇలా భయానక వాతావరణం సృష్టించడం చంద్రగిరికి మంచి సంస్కృతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన శనివారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గాడ్‌ఫాదర్ లాంటి కిలారు రాజేష్ తన చెప్పుచేతల్లో ఉన్నాడని, ఎంత చెబితే అంత చేస్తాడంటూ నాని అధికారులు, వ్యాపారులను బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో ఆయన, రాజేష్ ఉన్న ఫొటోలు, వీడియోలను చూపుతూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారన్నారు. మామూళ్లు ఇవ్వలేదని ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర నాయకుడు కిషోర్‌కు చెందిన రైస్ మిల్లును మూయించాడని, వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌కు చెందిన రూ.7 కోట్ల విలువైన రెండెకరాల భూమిని కాజేసేందుకు ప్రయతి్నంచారని తెలిపారు.
అంతేకాకుండా తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీలో రూ.250 కోట్ల విలువైన దేవదాయ శాఖకు చెందిన 10 ఎకరాల భూమిని ఆక్రమించారని చెప్పారు. చిత్తూరు నుంచి వంద మంది రౌడీలను తీసుకువచ్చి ఎండోమెంట్ అధికారులను బట్టలు విప్పించి, గదిలో బంధించి, మోకాళ్లపై నిలబెట్టి మరీ దాని చుట్టూ కాంపౌండ్ వాల్ నిరి్మంచారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఎండోమెంట్ డిప్యూటీ కలెక్టర్ రమే‹Ùనాయుడు జిల్లా కలెక్టర్‌కు, ప్రభుత్వానికి రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారన్నారు.
రోజూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఇంటికి పిలిపించుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. గట్టిగా ప్రశి్నంచిన వారిపై చిత్తూరు నుంచి రప్పించిన రౌడీ మూకలకు ముసుగులు వేయించి కత్తులు, రాడ్లు, బ్లేడ్‌లతో దాడులు చేయిస్తున్నారని తెలిపారు. నాని దందాలు, ఆక్రమణలపైనా విచారణ చేయించాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment