సాక్షి, తిరుపతి: టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని తీరుపై చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు సరైనవి కాదు.. మనిషిలో నిజాయితీ లేనప్పుడు వ్యక్తిగత విమర్శలు చేస్తారంటూ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తాను ఏ ఒక్క టీడీపీ నేత, కార్యకర్తను కూడా వేధింపులకు గురిచేయలేదన్నారు.
‘‘2014-19 వరకు టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేశాం. నాపై ఎన్నో కేసులు నమోదు చేసినా పోరాడా.. గతంలో మా పార్టీ కోసం ఎన్నో దెబ్బలు తిన్నా... నేనెప్పుడు పార్టీ కోసమే పనిచేశానని తెలిపారు. ‘‘నేను ఏ బాధ్యత తీసుకున్నా సమర్థవంతంగా నిర్వహించాను. టీడీపీ అధ్యక్షుడిగా నువ్వు ఏ రోజైనా పోరాటాలు చేశావా?. ‘టీడీపీ ప్రభుత్వం హయాంలో 2014-19 మధ్య నాపై 88 కేసులు పెట్టారు. 7నెలలు జైల్లో పెట్టారు’’ అంటూ చెవిరెడ్డి ధ్వజమెత్తారు.
‘‘2019 నుంచి 2024 వరకు మీ క్వారీలు ఏనాడైనా అపారా?. మీ 12 లారీలు ఏ రోజైన ఆపారా..?. కరెంట్ చార్జీలు బకాయిలు ఉన్నా.. మీ పాలిషింగ్ యూనిట్ నడిచిందా లేదా?. పచ్చటి పల్లెల్లో విద్వేషాలు రెచ్చ గొడుతున్నావు.. మీకుటుంబం పైనా నేను ఆరోపణలు చేయడం నా సంస్కృతి కాదు. కిలారు రాజేష్ పేరుతో దందాలు చేయలేదా?, అధికారులను బెదిరించ లేదా?. కిరోసిన్, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించలేదా? నేను ఓడిపోతే 4వ తేదీన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించలేదా?. చంద్రగిరి నియోజకవర్గం రాయలచెరువు రోడ్డు నెలరోజులకే వేశానంటే ప్రజలు ఎలా నమ్ముతారు?’’ అని చెవిరెడ్డి ప్రశ్నించారు
‘‘ప్రజలు అధికారం మీకు ఇచ్చారు.. ప్రశ్నించడం మాకు ఇచ్చారు. మేము పోరాటాలకు సిద్ధంగా ఉన్నా, ఏరోజూ వెనక్కు తగ్గం.. నా కుమారుడు మోహిత్ రెడ్డిపై కేసులు పెట్టారు, నా కొడుకు ఏరోజు కేసులకు భయపడే వ్యక్తి కాదు. తుడా పరిధిలో అవినీతిపై మీరు విచారణ చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా తుమ్మలగుంటలో 133 అడుగుల ఎత్తులో నిర్మాణం చేశాం. జాతీయ జెండా కూడా ఎగర నీయకుండా అడ్డుకున్నది నువ్వు కాదా?. తుడా అధికారులను బెదిరించలేదా?’’ అంటూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment