వందలాది మంది టీడీపీ రౌడీల తిష్ట
రెచ్చగొట్టి.. అల్లర్లు సృష్టించడమే
పనిగే నాని అనుచరుల ఆగడాలు
నామినేషన్స్ రోజున ఆర్డీఓ కార్యాలయం వద్ద దాడులు ప్లాన్‌లో భాగమే
పోలింగ్ రోజున చంద్రగిరి నియోజకవర్గంలో విధ్వంసం వెనుక ఎన్నో అనుమానాలు
సాక్షి, తిరుపతి: ఓటమి భయంతో కూటమి అభ్యర్థులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్ శాతాన్ని తగ్గించాలని పక్కా ప్లాన్‌తో విధ్వంసాలు సృష్టించారు.
అల్లర్లు సృష్టించి..అసత్యాలకు పదును పెట్టి
ఎన్నికల్లో అల్లర్లు, విధ్వంసాలు సృష్టించేందుకు కూటమి అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే విధ్వంసాలకు పథక రచన చేశారు. అందులో భాగంగానే నామినేషన్ రోజున ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వాహనంపై దాడికి తెగబడ్డారు. ఆపై విచక్షణారహితంగా పోలీసులపైన, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్ల వర్షం కురిపించారు. మరోవైపు తిరుపతి నగరంలో జరుగుతున్న ప్రచారంలో జనసేన రౌడీలు స్థానికులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులపైన దాడులకు తెగబడ్డారు. ఇదంతా కుట్రలో భాగమేనని ఓటర్లు చర్చించుకుంటున్నారు.
రిగ్గింగ్‌ని అడ్డుకున్నందుకే విధ్వంసాలు
పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గ ఓటర్లంతా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికే పట్టం కడుతున్నారన్న విషయాన్ని గ్రహించిన కూటమి అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రామంద్రాపురం మండలం, బ్రాహ్మణకాలువ పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కు యతి్నంచారు. తమకు అడ్డుగా ఉన్న దళిత ఏజెంట్‌ని బయటకు లాక్కొచ్చి అతనిపై దాడిచేశారు. వైఎస్సార్‌సీపీ పాకాల మండల పార్టీ అధ్యక్షులు నంగా నరే‹Ùరెడ్డి కుమారుడు లవంత్‌రెడ్డిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. తర్వాత పులివర్తివారి పల్లెలో రిగ్గింగ్‌కు యతి్నంచారు.
వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై మాజీ జెడ్పీటీసీ సురేష్ చౌదరి, పులివర్తి నాని కుమారుడు వినీల్ దాడికి దిగారు. నారావారిపల్లె పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పైనా టీడీపీ మూకలు దాడిచేశారు. అదేవిధంగా కూచువారిపల్లె పరిధిలోని పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కి అడ్డుగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్ రాజశేఖర్‌ని, రిలీవ్ ఏజెంట్‌గా ఉన్న సర్పంచ్ కొట్టాల చంద్రశేఖర్‌రెడ్డిపై దాడి చేశారు. చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. గ్రామానికి చేరుకున్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై దౌర్జన్యానికి దిగారు. మోహిత్‌రెడ్డి వాహనానికి నిప్పు పెట్టి, మరో ఎస్కార్ట్ వాహనాన్ని ధ్వంసం చేశారు. కార్యకర్తలపై దౌర్జన్యం చేశారు. కూచువారిపల్లెలో కార్యకర్తలను బేడ్లతో కోసి రక్త గాయాలు చేశారు.
అక్కడే ఎందుకు తిష్ట?
పోలింగ్ రోజున ఎటూ ఓటింగ్ శాతాన్ని తగ్గించలేకపోయామని భావించిన కూటమి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోతున్నారు. మహిళా విశ్వవిద్యాలయం ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉండగా స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో పులివర్తి నాని అనుచరులు మారణాయుధాలతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ పరిధిలో ఉన్న రౌడీ మూకలు మహిళా యూనివర్సిటీ సమీపంలో వైఎస్సార్‌సీపీ స్టిక్కర్‌తో ఉన్న ద్విచక్ర వాహనాన్ని కిందపడేసి ధ్వంసం చేశారు. ఆపై దానికి నిప్పంటించారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ నాయకుడికి కారును కూడా ధ్వంసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment