న్యూఢిల్లీ: కాంగ్రెస్ హయాంలో రాజధర్మాన్ని పాటించామని అన్ని వర్గాల ప్రజలను రక్షించామని ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి. కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రాజధర్మం వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ శనివారం కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ విషయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ మాటలనే మీరు పెడచెవిన పెట్టారు. ఇక.. మా మాటలను ఎందుకు వింటారు అంటూ కపిల్ సిబాల్ ఎద్దేవా చేశారు. వినడం, నేర్చుకోవడం, ఆచరించడం రాజధర్మంలో భాగమని.. ఇవేవీ కేంద్ర ప్రభుత్వం అనుసరించడం లేదని కపిల్ సిబాల్ విమర్శించారు. చదవండి: ఢిల్లీ అల్లర్లు : కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ
అయితే.. గురువారం రోజున ఈశాన్య ఢిల్లీలో మతపరమైన అల్లర్లను అదుపుచేయడంలోనూ, తన విధులను నిర్వర్తించడంలోనూ విఫలమైన కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి కోవింద్‌కు ఓ వినతిపత్రం అందజేశారు. తమ ప్రభుత్వ హయాంలో రాజధర్మాన్ని పాటించామని, దేశంలోని అన్ని వర్గాల ప్రజల విశ్వాసాలను గౌరవించి వారిని రక్షించామని గుర్తుచేశారు. దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ స్పందిస్తూ.. సోనియా గాంధీ, దయచేసి రాజధర్మం గురించి మాకు బోధించొద్దు. మీ చరిత్ర అంతా తప్పులతడక అని అన్నారు. కాంగ్రెస్ ఏదైనా చేస్తే అది మంచిది. అదే మేంచేస్తే ప్రజలను రెచ్చగొడతారు.ఇది ఎలాంటి రాజధర్మం? అని ప్రశ్నించిన విషయం తెలిసిందే.
Law Minister to Congress :
— Kapil Sibal (@KapilSibal) February 29, 2020
“ Please don’t preach us Rajdharma “
How can we Mr. Minister ?
When you did not listen to Vajpayeeji in Gujarat why would you listen to us !
Listening , learning and obeying Rajdharma not one of your Government’s strong points !
Comments
Please login to add a commentAdd a comment