స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాల్లో పాలక తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటింది.
కోల్‌కతాః స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాల్లో పాలక తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటింది. ఈనెల 13న పశ్చిమ బెంగాల్‌లో మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ప్రతిపక్షాలు దరిదాపుల్లో లేకుండాపోయాయి. మొత్తం 148 వార్డులకు 140 వార్డులను తృణమూల్ గెలుచుకోగా బీజేపీ ఆరింటిని, వామపక్షాలు, ఇండిపెండెంట్‌లు చెరొకటి గెలుచుకున్నాయి.
కాగా గూర్ఖా జన్‌ముక్తి మోర్చాకు గట్టి పట్టున్న ఉత్తర బెంగాల్‌లో ప్రాబల్యం కోసం పాలక తృణమూల్ సాగించిన ప్రయత్నాలు కొంతమేర ఫలించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మరో వైపు కాంగ్రెస్, వామపక్షాలకు దీటుగా బీజేపీ ఆరు వార్డుల్లో గెలుపొంది, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడంతో కమలనాథులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపుతో బెంగాల్‌లో పార్టీ విస్తరణకు పూనుకునేందుకు బీజేపీకి స్ధానిక ఫలితాలు టానిక్‌లా పని చేస్తాయని చెబుతున్నారు.