బీజేపీ ఎంపీ వాహనంపై దాడి | Tmc Workers Ransacked Bjp Mps Vehicle In West Bengal | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీ వాహనంపై దాడి

Published Sun, Sep 1 2019 4:25 PM | Last Updated on Sun, Sep 1 2019 4:28 PM

Tmc Workers Ransacked Bjp Mps Vehicle In West Bengal - Sakshi

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నేతలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి.

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌పై దాడి ఘటన మరువకముందే మరో బెంగాల్‌ నేతపై తృణమూల్‌ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. బరక్‌పూర్‌ ఎంపీ అర్జున్‌ సింగ్‌ ప్రయాణిస్తున్న వాహనంపై ఆదివారం మధ్యాహ్నం కొందరు తృణమూల్‌ కార్యకర్తలు దాడికి పాల్పడి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా శ్యామ్‌నగర్‌లోని ఫీడర్‌ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ, తృణమూల్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తగా పోలీసులు జరిపిన లాఠీచార్జిలో బీజేపీ ఎంపీ అర్జున్‌ సింగ్‌కు తలపై గాయాలయ్యాయి. పలువురు బీజేపీ కార్యకర్తలపైనా పోలీసులు లాఠీలు ఝళిపించారు. కాగా బరక్‌పూర్‌ పోలీస్‌ కమిషనర్‌ మనోజ్‌ వర్మ తన తలపై లాఠీతో బలంగా కొట్టారని, బీజేపీ కార్యకర్తలనూ ఆయన చితకబాదారని ఎంపీ అర్జున్‌ సింగ్‌ ఆరోపించారు. బీజేపీ ఎంపీ కారును తృణమూల్‌ కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement