
సాక్షి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల నిరసనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. బెంగాల్‌లో కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా టీఎంసీ ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టారు. దీంతో సభా సమావేశాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం రాజకీయ కక్షసారింపు చర్యలు సరికావని కేంద్రానికి వ్యతిరేకంగా టీఎంసీ ఎంపీలు నినాదాలు చేశారు.
తృణమూల్‌కు మద్దతుగా విపక్షాలు కూడా ఆందోళన బాటపట్టాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభను మధ్యాహ్నాం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. కాగా బెంగాల్‌లో సీబీఐ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం వార్ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.