
కోల్‌కతా : కేంద్ర ప్రభుత్వ సారథ్యంలోని సీబీఐ తీరును వ్యతిరేకిస్తూ మూడు రోజుల పాటు తాను చేపట్టిన దీక్ష రాజ్యాంగం, ప్రజాస్వామ్య విజయమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ అధికారుల దాడులను నిరసిస్తూ ఆమె చేపట్టిన దీక్షను మంగళవారం సాయంత్రం విరమించారు.
సీబీఐ ఉదంతంలో సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించిందని, వచ్చే వారం ఈ అంశాన్ని తాము ఢిల్లీలో జాతీయ స్ధాయిలో లేవనెత్తుతామని చెప్పారు. ఓ పోలీస్ అధికారి అంటే కేంద్రం ఎందుకు భయపడుతోందని ఆమె ప్రశ్నించారు. సుప్రీం కోర్టు నేడు సానుకూల తీర్పు ఇచ్చిందన్నారు. కాగా సీబీఐ విచారణకు హాజరు కావాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది.
శారదా చిట్‌ఫండ్ స్కాం, రోజ్‌వ్యాలీ కుంభకోణం కేసులకు సంబంధించి ప్రశ్నించేందుకు ఆదివారం సాయంత్రం కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులను ఆయన నివాసం ఎదుటే కోల్‌కతా పోలీసులు అడ్డగించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment