
ప్రతీకాత్మకచిత్రం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నపూర్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. మృతుడిని బాక్చా గ్రామ సర్పంచ్ వాస్‌దేవ్ మొండల్‌గా గుర్తించారు. మొండల్ సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తన కుమార్తె ఇంటిని వస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. బాధితుడిని దుండగులు పదునైన ఆయుధంతో పొడిచి చంపారని పోలీసులు తెలిపారు. హతుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెంగాల్‌లో గత వారం రోజులుగా పలు హత్యలు చోటుచేసుకున్నాయి. ఆదివారం నదియా జిల్లాలో 55 సంవత్సరాల స్ధానిక బీజేపీ నేత హరాల దేవ్‌నాధ్‌ను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. గత వారం ముర్షిదాబాద్‌లో ఆరెస్సెస్ కార్యకర్త ప్రకాష్ పాల్ గర్భవతి అయిన ఆయన భార్య, ఆరేళ్ల కుమారుడిని దుండగులు హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment