
మిథున్ చక్రవర్తికి ఈడీ సమన్లు
కోల్‌కతా: కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి బాలీవుడ్ నటుడు, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. కుంభకోణానికి సంబంధించి.. పత్రాలను అందజేయడంలో విఫలమైన కారణంగా ఈ సమన్లు జారీ చేయాల్సి వచ్చిందని ఈడీ పేర్కొంది.
మనీ లాండరింగ్ చట్టం కింద సమన్లు జారీ చేసినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. విచారణకు సంబంధించి సరైన పత్రాలను సమర్పించడంలో చక్రవర్తి విఫలమయ్యారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, చక్రవర్తి లాయర్ బిమన్ సర్కార్ మాత్రం.. ఈడీ నుంచి తమకు ఎలాంటి సమన్లు అందలేదన్నారు.