‘బీజేపీకి మమతా బెనర్జీ భయపడుతున్నారు’ | Congress MP Adhir Ranjan on TMC chief Mamata Is Afraid Of BJP | Sakshi
Sakshi News home page

‘బీజేపీకి మమతా బెనర్జీ భయపడుతున్నారు’..దీదీపై అధీర్‌ రంజన్‌ విమర్శలు

Published Sat, Feb 3 2024 6:53 PM | Last Updated on Sat, Feb 3 2024 7:10 PM

Congress MP Adhir Ranjan on TMC chief Mamata Is Afraid Of BJP - Sakshi

టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్‌ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు బెంగాల్‌ రాష్ట పీసీసీ చీఫ్‌, ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌధరీ కౌంటర్‌ ఇచ్చారు.  కాంగ్రెస్‌కు పార్లమెంట్‌లో ఎన్నికల్లో కనీసం  40 సీట్లు కూడా వసస్తాయో? రావో? అనుమానమని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. 

‘బీజేపీ, మమతా బెనర్జీకి కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధించడం ఇష్టం లేదు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ టీఎంసీకి అధినేత్రి అయి ఉండి ఇలా ఉండటం దురదృష్టకరం. మమతా బెనర్జీ తనకు తానుగా ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరారు. మమతా బీజేపీకి భయడుతోంది. మరీ ఎందుకు ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు’ అని అధీర్‌ రంజన్‌ మండిపడ్డారు.​ 

‘కాంగ్రెస్‌ పార్టీ ఖతం అవుతుంది. కాంగ్రెస్‌తో ఏం కాదని బీజేపీ అంటోంది. మమతా బెనర్జీ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 40 సీట్లు గెలవటం అనుమానం అంటున్నారు. కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకియాలు  చేస్తోందని బీజేపీ,  మోదీ అంటున్నారు.  మమతా కూడా అవే మాటాలు వ్యాఖ్యాస్తున్నారు’అని దుయ్యబట్టారు. బీజేపీ, మమతా ఎందుకు ఒకే రాగం పడుతున్నారో? చెప్పాలని నిలదీశారు. మమతాకు ఎప్పుడూ రాష్ట్రం తరువాతేనని విమర్శించారు. కానీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి  ముందు దేశం ప్రాధాన్యత అని..   ఆ తర్వాతే ఏదైనా అని తెలిపారు. 

చదవండి: కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ సవాల్‌.. అక్కడ గెలిచే దమ్ముందా!
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement