సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్, బహరంపూర్ లోక్‌సభ అభ్యర్థి 'అధీర్ రంజన్ చౌదరి' ప్రధాన ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్‌కు రెండు పేజీల లేఖ రాశారు.
చౌదరి రాసిన లేఖలో బహరంపూర్‌లోని పోలీసు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్దేశ్యపూరితంగానే వారు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందిపెడుతున్నట్లు వెల్లడించారు. వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పోలీసులు తీసుకుంటున్న చర్యలు పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపరుస్తాయని అన్నారు. నా ఎన్నికల ప్రచారానికి ఆటంకం కలిగించడానికి ఇది ప్రణాళిక అని కూడా అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం న్యాయం కాదని పేర్కొన్నారు. తన కార్యకర్తలను మాత్రమే కాకుండా సన్నిహితులను కూడా పోలీసు అధికారులు వేధిస్తున్నారని అన్నారు.
'అధీర్ రంజన్ చౌదరి' కంచుకోట అయిన బహరంపూర్ నియోజకవర్గం నుంచి మళ్ళీ బలిలోకి దిగారు. ఈయనకు ప్రత్యర్థిగా టీఎంసీ 'యూసఫ్ పఠాన్'ను ఎంపిక చేసింది. దీంతో ఇప్పటికే బహరంపూర్ నుంచి ఐదుసార్లు గెలిచిన చౌదరితో.. యూసఫ్ పఠాన్ తలపడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment